Telugu Flash News

Ketu Dosham : జాతకంలో కేతు దోషం ఉంటే ఏ పరిహారాలు చేసుకోవాలి?

Ketu Dosham : ద్వాదశ రాశుల్లో అనేక రాశుల వారికి, వ్యక్తిగత జాతక రీత్యా కూడా కొన్ని దోషాలు ఉంటం కామనే. అయితే, వీటికి పరిహారాలు కూడా పండితుల సూచనల మేరకు పలువురు జ్యోతిష్యాన్ని నమ్మే వారు పాటిస్తూ ఉంటారు. ఇందులో ఒకటి కేతు దోషం.

శని తర్వాత బాగా భయపెట్టే గ్రహాలు రాహు, కేతువులుగా చెబుతారు. ఒక రకంగా ఇవి గ్రహాలు కావు. కానీ వాటిని ఛాయ గ్రహాలు అంటారు. శనితో న్యాయం అందించే వాడిగా పరిగణిస్తారు. తప్పు చెయ్యని వారికి శని హాని తలపెట్టడని పెద్దలు చెబుతారు. కానీ రాహుకేతువులు అలా కాదట.

కేతువు మీన రాశి పాలక గ్రహం. అందుకే ఈ రాశి వారికి జాతకంలో రాహుం స్థానం చాలా కీలకమైనది. అంతే కాకుండా ధనస్సులో ఉచ్చ స్థితిలో ఉండి మిథునంలో క్షీణిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ మూడు రాశుల మీద కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుందట.

జాతకంలో కేతు దోశం ఉన్న వ్యక్తులు చాలా ఏళ్ల పాటు సాధారణ జీవితాన్ని గడపుతారు. మీనం, ధనస్సు, మిథున రాశి వారి జాతకంలో కేతువు ఉచ్చమైన దశ ఉంటే దాని ప్రభావం సాధారణంగా 48 నుంచి 54 ఏళ్లలో చూస్తారట. కేతు దోష నివారణకు ఎర్ర చందనంతో చేసిన 108 పూసల జపమాల తీసుకుని పండితుల సమక్షంలో అభిమంత్రించి ప్రతి మంగళ వారం ధరించాలి.

Read Also : Vastu tips in telugu : ఇలాంటి వస్తువులు మీ చేతిలోంచి జారిపోతే అశుభం!

Exit mobile version