Homenewsమెస్సీ కోసం కేరళ నుండి ఖతార్ కు.. 33 ఏళ్ల నాజీ నౌషి ఒంటరి ప్రయాణం

మెస్సీ కోసం కేరళ నుండి ఖతార్ కు.. 33 ఏళ్ల నాజీ నౌషి ఒంటరి ప్రయాణం

Telugu Flash News

భారత ప్రజలకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెటర్లను దేవుళ్లలా పూజిస్తారు. పశ్చిమ బెంగాల్, గోవా మరియు కేరళలో ఎక్కువ మంది ప్రజలు ఫుట్‌బాల్‌ను ఇష్టపడతారు. చాలా మంది సాకర్ ప్లేయర్‌లకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీకి భారత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి కేరళకు చెందిన ఓ మహిళా అభిమాని అతని కోసం గొప్ప సాహసం చేసింది. ఐదుగురు పిల్లల తల్లి అయిన 33 ఏళ్ల నాజీ నౌషి, ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ ఆడుతున్న ఆటను చూసేందుకు కేరళ నుంచి ఖతార్ వెళ్లింది.

ఇందులో ప్రత్యేకత ఏంటని అనుకుంటున్నారా? ఆమె ఒంటరిగా కారులో ఖతార్ చేరుకుంది. అక్టోబరు 15న ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఫిఫా వరల్డ్ కప్, మెస్సీ ఫొటోలతో అలంకరించిన ప్రత్యేక సదుపాయాలతో కూడిన ఎస్ యూవీలో దేశ తీరాలు దాటి ఖతార్ చేరుకుంది. అయితే తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఓడిపోవడంతో అభిమానులందరిలాగే ఆమె కూడా షాక్‌కు గురైంది. అయితే అర్జెంటీనా జట్టు కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె చెప్పినట్లుగానే శనివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 గోల్స్ తేడాతో మెక్సికోను ఓడించి ప్రపంచకప్ నాకౌట్ రేసులోకి ప్రవేశించింది.

also read :

Jai Balayya: మరీ ఇంతలా కాపీ కొట్టలా.. పరువు తీసావ్ కదయ్యా థ‌మ‌న్.. నెటిజ‌న్స్ ట్రోల్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News