Telugu Flash News

పదో తరగతి విద్యార్థి ఎలక్ట్రిక్‌ సైకిల్‌ తయారు చేశాడు!

kerala student made electric cycle

Kerala boy suffering from ADHD made electric cycle : ప్రస్తుతం దేశ వ్యాప్తంలో విద్యార్థులు యాంత్రికమైన చదువులు చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో విద్యార్థులకు చదువు కేవలం కొంటున్నారు తప్ప అభ్యసించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు చాలా వరకు కృషి చేయడం లేదు. ఇందుకు భిన్నంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త ఆలోచనలతో దూసుకెళ్తున్నారు.

ఇన్నోవేషన్‌, టెక్నాలజీపై ఫోకస్‌ పెడుతున్నారు కొందరు విద్యార్థులు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు స్కూళ్లలోనూ కొందరు తమ మెదడుకు పని పెడుతూ కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు విద్యార్థులు. తాజాగా కేరళ రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఒకరు ఇలాంటి రికార్డే సృష్టించాడు. చిన్ననాటి నుంచే కొత్తగా ఏదైనా తయారు చేయాలన్న తపన కలిగిన ఆ స్టూడెంట్‌.. పదో తరగతి చదువుతూనే ఇన్నోవేషన్‌కు శ్రీకారం చుట్టాడు.

హైపర్‌ యాక్టివ్‌ డిజాస్టర్‌తో బాధపడుతున్న కేరళకు చెందిన సయంత్‌ అనే విద్యార్థి బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. కేవలం నాలుగు గంటలు ఛార్జింగ్‌ చేస్తే చాలు.. 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. పూర్తిగా విద్యుత్‌ చార్జింగ్‌తో నడిచేలా ఈ సైకిల్‌ను తయారు చేశాడు సయంత్‌. సయంత్‌కు చిన్ననాటి నుంచే ఎలక్ట్రిక్‌ వస్తువులంటే అమితమైన ఆసక్తి. చిన్న యంత్రాన్ని చూసినా అందులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస చూపించేవాడు.

కాలికట్‌ జిల్లాలోని కోయిలాండికి చెందిన శ్రీధరన్‌, గీతల కుమారుడు సయంత్‌. స్థానికంగా ప్రభుత్వ స్కూల్‌లో పదో క్లాస్‌ చదువుతున్నాడు. ఇతను కొన్ని విషయాల్లో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ వెంటనే ఏకాగ్రత కోల్పోతుంటాడు. చిన్ననాటి నుంచి హైపర్‌ యాక్టివ్‌ అనే ఈ డిజాస్టర్‌తో బాధపడుతున్నాడు. ఇతను రూపొందించిన చార్జింగ్‌ సైకిల్‌ హ్యాండిల్‌ వద్ద బ్యాటరీ ఇండికేటర్‌ ఉంటుంది. అది ఛార్జింగ్‌ అయిపోతే ఇండికేట్‌ చేస్తుంది. ఈ సైకిల్‌ తయారీకి 25 వేల రూపాయలు ఖర్చయిందని సయంత్‌ తెలిపాడు. పది పాసయ్యాక పాలిటెక్నిక్‌ చదువుతానని చెబుతున్నాడు.

also read:

Siddharth – Aditi ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయిన‌ట్టేనా!

YCP MLA : కర్నూలుకు వ్యాపించిన అసంతృప్తి సెగ..

Exit mobile version