Telugu Flash News

ప్రగతి భవన్‌ లో ముగ్గురు ముఖ్యమంత్రుల సమావేశం..

three chief ministers

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈరోజు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ ను సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతి భవన్‌కు విచ్చేసిన ముఖ్యమంత్రులకు కేసీఆర్ ఘనస్వాగతం పలికారు. ఇద్దరు సీఎంలతో కలిసి కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం సమావేశం నిర్వహించనున్నారు.

అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మద్దతు కోరేందుకు కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుండగా.. ఆ సమావేశంలో మొత్తం ఏడుగురు సీఎంలు మౌనంగా ఉన్నారని సమాచారం. ఆ ఏడుగురిలో ముగ్గురు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ హైదరాబాద్‌లో సమావేశమవుతున్నారు.

read more news :

కొత్త పార్లమెంట్ అవసరం ఏంటి ? నితీశ్ విమర్శ

Exit mobile version