HomecinemaKeerthy Suresh : ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్‌ సోదరి.. అక్కా,చెల్లెళ్లు దున్నేస్తారేమో..!

Keerthy Suresh : ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్‌ సోదరి.. అక్కా,చెల్లెళ్లు దున్నేస్తారేమో..!

Telugu Flash News

Keerthy Suresh: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగింటి ఆడ‌ప‌డుచుగా మారింది. తెలుగులో మంచి చిత్రాలు చేస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. మ‌హాన‌టి సినిమాతో కీర్తి సురేష్‌కి పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ద‌క్కింది. కీర్తి సురేష్ ఇటీవల కాలంలో మహేష్ బాబు‌ సరసన సర్కారు వారి పాటలో నటించి మంచి హిట్టు అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో నాని సరసన దసరా అనే సినిమా చేయ‌గా, ఈ చిత్రం కూడా బంప‌ర్ హిట్ అయింది.

కీర్తి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కాయి. దసరా మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మ‌రో వైపు స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇక కీర్తి సురేష్ తల్లి మేనక సీనియర్ హీరోయిన్ కాగా, ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నమ్మాయి కీర్తి సురేష్ స్టార్ ఇప్పుడు హీరోయిన్ అయిన విష‌యం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి అంచలంచెలుగా ఎదుగుతూ తల్లికి దగ్గ కూతురు అనిపించుకుంది.

ఇక ఇప్పుడు కీర్తి సోద‌రి కూడా సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు టైం ఫిక్స్ చేసుకుంది.అయితే ఆమె న‌టిగా కాకుండా ద‌ర్శ‌కురాలిగా త‌న టాలెంట్ చూపించాల‌ని అనుకుంటుంది. కీర్తి సురేష్ అక్క పేరు రేవతి సురేష్ కాగా, ఆమెని త్వ‌ర‌గానే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. అయితే ఆమెకు ఇన్నాళ్లకు పరిశ్రమ వైపు మనసు మళ్లింది. దాంతో రేవతి సురేష్ లేడీ డైరెక్టర్ అవతారం ఎత్తి ఓ సినిమా చేస్తుంది.

థాంక్ యూ టైటిల్ తో చిత్రం చేస్తుండ‌గా, తాజాగా విడుదలైన‌ ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. కీర్తి సురేష్ అక్క డైరెక్టర్ కావడం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. కీర్తి ఫ్యాన్స్ ఆమె అక్కకు బెస్ట్ విషెస్ చెబుతూ, ఆమె డైరెక్టర్ గా రాణించాలని కోరుకుంటున్నారు.

అయితే అక్క రేవతి సురేష్ తొలి షార్ట్ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమ‌లకి వెళ్లింది కీర్తి సురేష్‌. అక్క‌డ ఆమెతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటి ప‌డ్డారు. దర్శనానంతరం కీర్తి సురేష్ ఆలయం నుంచి బయటికి వచ్చే సమయంలో ఆలయ సెక్యూరిటీ సిబ్బందితో పాటు అక్కడున్న భక్తులు సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

కీర్తి సురేష్‌ను తమ స్మార్ట్‌ఫోన్లలో బంధించడానికి నానా తంటాలు ప‌డ్డారు. ఎలాగోలో కీర్తి సురేష్ సేఫ్‌గా త‌న కారు ఎక్కి వెళ్లింది. ఇక కీర్తి ప్ర‌స్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల రివాల్వర్ రాణి టైటిల్ తో కొత్త మూవీ ప్రకటించ‌గా, ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే స్టార్ట్ కానున్న‌ట్టు తెలుస్తుంది. ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, సిస్టర్స్ రోల్స్ చేయడం అంద‌రికి షాకింగ్‌గా మారింది. పెద్దన్న మూవీలో రజినీకాంత్ చెల్లెలుగా నటించిన కీర్తి , భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలుగా కనిపించి అల‌రించనుంది.

-Advertisement-

read more news :

Raashi Khanna Latest Hot Photos 28.05.2023 | iifa awards 2023

Sharwanand: మరో వారం రోజుల్లో పెళ్లి.. కారు ప్రమాదంలో గాయపడ్డ హీరో శర్వానంద్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News