HomecinemaKeerthy Suresh: మ‌ళ్లీ వార్త‌ల‌లోకి కీర్తి సురేష్ పెళ్లి.. ఆమె భ‌ర్త ఇత‌డేనా?

Keerthy Suresh: మ‌ళ్లీ వార్త‌ల‌లోకి కీర్తి సురేష్ పెళ్లి.. ఆమె భ‌ర్త ఇత‌డేనా?

Telugu Flash News

Keerthy Suresh: మ‌ల‌యాళ న‌టి కీర్తి సురేష్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు మ‌హాన‌టి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ అందుకుంది. ఇక ఈ సినిమా త‌ర్వాత ప‌లు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేసిన పెద్ద‌గా విజ‌యాలు సాధించ‌లేదు. ప్ర‌స్తుతం మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతుంది కీర్తి సురేష్‌. అయితే ఈ అమ్మ‌డు థ‌ర్టీ ప్ల‌స్ లోకి రావ‌డంతో వారి పెళ్లి గురించి సోష‌ల్ మీడియాలో అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్ట‌ర్తో లేదంటే హీరోతో ఇలా పలువురితో ఈ అమ్మ‌డు పెళ్లి జ‌ర‌గ‌నుందంటూ అనేక ప్ర‌చారాలు సాగాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కీర్తి పెళ్లి మేటర్ మ‌రోసారి హాట్ టాపిక్ అయింది. తాజాగా కీర్తి వివాహమంటూ కథనాలు వెలువడుతున్నాయి. కీర్తి సురేష్ ఓ వ్యక్తితో సన్నిహితంగా కనిపించ‌డంతో పుకారు మొదైలంది.

స‌ద‌రు వ్యక్తి పుట్టినరోజు నేపథ్యంలో బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు కీర్తి సురేష్‌. అతనితో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది. కీర్తి అంత ప్రేమ కురిపిస్తున్న ఈ వ్యక్తి ఎవరని ఆరాతీస్తే అతని పేరు ఫర్హాన్ బీన్ లియాకత్. రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలిసింది. ఆస్తి అంతస్తు హోదాలో కీర్తికి తగినవాడు అని… ఫర్హాన్ ని కీర్తి సురేష్ ప్రేమిస్తుండగా పెళ్లి ప్రకటన త్వ‌ర‌లోనే రానుంది అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం తెగ వైర‌ల్ అవుతుంది. గతంలో కీర్తి తన క్లాస్ మేట్ ని వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా వినిపించింది. ఈ వార్తలను కీర్తి సురేష్ తల్లి ఖండించ‌డంతో వాటికి పులిస్టాప్ ప‌డింది. కీర్తి పెళ్లికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి.

ఇక కీర్తి లేటెస్ట్ మూవీ దసరా రీఎంట్‌గా విడుద‌లై సూపర్ హిట్ కొట్టింది. దసరా ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. నాని హీరోగా తెరకెక్కిన దసరా మార్చి 30న విడుదలై ఈ అమ్మ‌డి ఖాతాలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా చేరింది. ఇక ఈ మ‌ధ్య కీర్తి సోషల్ మీడియా వేదికగా స్కిన్ షోకి తెరలేపుతుంది. గ్లామరస్ హీరోయిన్స్ కి మైలేజ్ ఎక్కువ కాబ‌ట్టి, హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తో ఇండ‌స్ట్రీలో రాణించడం అంత సులభం కాదని తెగ చూనిస్తుంది. సర్కారు వారి పాట మూవీకి ముందు ఆమె బాగా స్లిమ్ అయ్యార‌నే చెప్పాలి. చిత్రంలో కిలాడీ లేడీగా మహేష్ నే అల్లాడించింది.తాను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్రలైనా చేయగలనని నిరూపించింది. ఒక ప్రక్కన స్టార్స్ తో చిత్రాలు చేస్తున్న కీర్తి, మ‌రో ప‌క్క‌ సిస్టర్స్ రోల్స్ చేయడం కొసమెరుపు. చెల్లెలు పాత్రలు చేస్తే హీరోయిన్ గా కెరీర్ ముగుస్తుందని చాలా మంది భయపడతారు. అందుకు భిన్నంగా కీర్తి ఆలోచిస్తుంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News