Telugu Flash News

Himanshu rao : ఓక్రిడ్జ్‌ స్కూల్‌లో కాస్నివాల్‌ వేడుక.. కేసీఆర్‌ మనవడు హిమాన్షు నాయకత్వం..

హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్‌ స్కూల్‌లో కాస్నివాల్‌ వేడుక వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, కేటీఆర్ కొడుకు హిమాన్షు (Himanshu rao) ముందుండి నడిపించాడు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సృజనాత్మకత, సామాజిక స్పృహ లక్ష్యంగా కాస్నివాల్‌ నిర్వహించారు. ఇందుకు ఇన్‌చార్జ్‌గా మంత్రి కేటీఆర్‌ తనయుడు హిమాన్షు వ్యవహరించాడు.

కార్యక్రమంలో భాగంగా 30కి పైగా స్టాళ్లను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో తమ కళారూపాలను ఏర్పాటు చేశారు. ఫుడ్‌, ఫన్‌, గేమ్స్‌ ఆడటం, సైకిల్‌ పెయింటింగ్‌ స్టాల్స్‌, లైవ్‌ మ్యూజిక్‌ లాంటి కార్యక్రమాలతో విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు.

ఈవెంట్‌లో మాట్లాడిన మంత్రి సబిత.. ఈ కాలం పిల్లల ఆలోచన విధానానికి కాస్నివాల్‌ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడేలా స్వతంత్రంగా వ్యవహరించేలా ఇలాంటి ఈవెంట్లు విద్యార్థులకు ధైర్యాన్ని ఇస్తాయన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇన్నోవేషన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము రాష్ట్రాన్ని చదివితే.. ప్రస్తుత జనరేషన్‌ పిల్లలు ప్రపంచాన్నే చదివేస్తున్నారని చెప్పారు.

ఇక కేసీఆర్‌ మనవడు హిమాన్షు ఈ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. తమ కాస్నివాల్‌ కార్యక్రమంలో పర్యావరణం, విద్యకు మధ్య వారధి లాంటిదని పేర్కొన్నాడు. తాను చదువుకోవడంతోపాటు సామాజిక సేవ కూడా చేస్తున్నట్లు తెలిపాడు. కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సాధ్యమని చెప్పాడు. ఈ ఈవెంట్‌ ద్వారా వచ్చే డబ్బుతో నానక్‌రామ్‌గూడ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణకు ఇస్తామని తెలిపాడు. దీంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హిమాన్షును అభినందనలతో ముంచెత్తారు. ఓక్రిడ్జ్‌ స్కూల్‌ పిల్లలు భవిష్యత్‌లో రోల్‌మోడల్‌గా నిలుస్తారని మంత్రి కితాబిచ్చారు.

also read:

RGV : పవన్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటంటూ వర్మ ట్వీట్లు

Tarakaratna: విష‌మంగా తార‌క‌ర‌త్న ఆరోగ్య ప‌రిస్థితి.. ఆ వ్యాధి అంత ప్రమాదకరమా ?

Exit mobile version