Kavitha: సీనియర్ నటి కవిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఎన్నో సినిమాలలో మంచి పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించింది. అయితే వెండితెరపై ప్రేక్షకులకి మంచి వినోదం పంచే కవిత జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది అని చెప్పాలి. బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన కవిత మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. అయితే హీరోయిన్ గా రిటైర్ అయ్యాక క్యారెక్టర్ రోల్స్ చేశారు. సీరియల్స్ కూడా చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో చోటు చేసుకున్న విషాదాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు…
నా భర్త దశరథ్ రాజ్ వ్యాపారం చేసేవారు అని చెప్పిన కవిత… ఆరేళ్ళ క్రితం బిజినెస్ లో బాగా నష్టం వచ్చిందని పేర్కొంది.. తొమ్మిది నెలల వ్యవధిలో రూ. 132 కోట్లు ఆయన నష్టపోయారు. ఈ విషయాన్ని మా దగ్గర దాచాడు. తనలో తానే మదనపడుతూ అనారోగ్యం బారినపడి ఒకరోజు సడన్ గా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తీసుకెళితే బ్రతకడం కష్టమని డాక్టర్స్ అన్నారు. దాదాపు 11 రోజులు కోమాలో ఉన్నారు. తర్వాత కళ్ళు తెరవడంతో మరో నెల రోజులు ఐసీయూలో చికిత్స అందించాము. అనంతరం ఆయనని కౌన్సిలింగ్ చేయిస్తే వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పారు. అయితే అప్పుడు డబ్బు కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా అని నేను మందలించి అతనిలో ధైర్యం నింపాను.
ఇక జయచిత్ర గురించి మా ఇద్దరి మధ్య పదే పదే గొడవలు అయ్యాయి. ఓ సారి డైరెక్టర్ నన్ను చీర మార్చుకుని రమ్మంటే.. జయ చిత్ర.. ఏయ్ చీర మార్చుకోవే అని వేలు చూపించి సీరియస్‌గా చెప్పింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి ఉన్న నేను, మీ పని మీరు చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చాను మా ఇద్దరి మధ్య గొడవ కారణంగా ఆ మూవీ ఏడాది ఆగిపోయిందని కవిత పేర్కొంది. ఇక కరోనా సమయంలో కోవిడ్ సోకి నా భర్త మరణించాడు. ఆయన మరణించిన పది రోజులకు కొడుకు కూడా కన్నుమూయడంతో చాలా కుమిలిపోయాను. మూడు సార్లు ఆత్మహత్యాయత్నం చేసుకోవాలని కూడా అనిపించిందని కవిత పేర్కొంది