HomecinemaS S Karthikeya : ఆస్కార్ రావ‌డానికి మూల కార‌ణం రాజ‌మౌళి కాదు , ఆయ‌న కొడుకు..!

S S Karthikeya : ఆస్కార్ రావ‌డానికి మూల కార‌ణం రాజ‌మౌళి కాదు , ఆయ‌న కొడుకు..!

Telugu Flash News

S S Karthikeya : తెలుగోడి స‌త్తా చూపించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కూడా గెలిచి తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా పాకేలా చేసింది. ల‌గాన్ త‌ర్వాత ఇండియన్ సినిమా ఆస్కార్ రుచిని చ‌విచూసింది లేదు.

అయితే ఇన్నాళ్ల త‌ర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ ద‌క్కింది అంటే దాని వెనకాల ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే ర‌మా రాజౌమౌళి త‌న‌యుడు కార్తికేయ. ఆస్కార్ అందుకున్న త‌ర్వాత కీరవాణి మాట్లాడుతూ రాజమౌళితో పాటు కార్తికేయకు మాత్రమే థ్యాంక్స్ చెప్పారు.


also read : pumpkin seeds benefits : గుమ్మడి గింజలు తింటే అద్భుత లాభాలు


కొన్నాళ్లు టెక్నీషియన్ గా పనిచేసిన కార్తికేయ.. ప్రస్తుతం లైన్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. అయితే మార్కెటింగ్, ప్రమోషన్స్ విషయంలో దిట్ట ఇతడు.. ఇత‌ను వేరియన్స్ ఫిల్మ్స్ సహాయంతో ఆస్కార్ కు సినిమాని పంపడానికి కావాల్సిన అన్ని అర్హతలను సాధించి అమెరికా, జపాన్ లాంటి దేశాల్లో స్క్రీనింగ్, ప్రమోషన్స్ విషయంలో దగ్గరుండి ప్రతి బాధ్యతను చాలా చ‌క్క‌గా నిర్వ‌ర్తించాడు.

తెర వెన‌క ఉండి ఆయ‌న కర్త-కర్మ-క్రియ అయి నడిపించిన తీరుకి ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆస్కార్ గెలుచుకున్న తర్వాత కార్తికేయని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్ట‌డం మనం చూశాం. ఏదేమైన కార్తికేయ ఇప్పుడు అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News