కార్తికేయ 2 చిత్రం ఈ రోజు విడుదల అయ్యింది. ఎలా ఉందో తెలుసుకుందాం..
వృత్తి పరంగా డాక్టర్ అయిన కార్తికేయ (nikhil siddharth) తన తల్లి మొక్కు తీర్చడానికి ద్వారకకు వెళ్తారు . శ్రీకృష్ణుని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన ద్వారకలో, కార్తికేయ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేస్తారు. కానీ ముగ్ధ (anupama parameswaran) పోలీసుల నుండి కార్తికేయను తప్పిస్తుంది. ఇంతకీ ఈ ముగ్ధ ఎవరు? కార్తికేయకి ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? శ్రీకృష్ణుడు కార్తికేయుడిని ద్వారకకు ఎందుకు రప్పించాడు? చివరకు కార్తికేయ ఏం సాధించాడు?, ఈ మొత్తం వ్యవహారంలో అతనికి ఎదురైన సమస్యలు ఏమిటి? అన్నది తెరపై చూడాల్సిందే..
కార్తికేయ 2 కథే ప్లస్ పాయింట్
చందు మొండేటి (chandoo mondeti) రాసిన కథే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఆ కథను చందు తెరపై అద్భుతంగా చూపించాడు. నటీనటుల విషయానికి వస్తే.. నిఖిల్ పాత్ర చాలా బాగుంది. కార్తికేయ పాత్రలో నిఖిల్ చాలా బాగా నటించాడు. కొన్ని ప్రత్యేక సన్నివేశాల్లో తన రియలిస్టిక్ నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లోని కొన్ని అడ్వెంచర్ సీన్స్‌లోనూ, సెకండాఫ్‌లోని కీలక సన్నివేశాల్లోనూ నిఖిల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో అనుపమ్ ఖేర్ బాగా నటించాడు. శ్రీనివాస్ రెడ్డి, హర్షతో పాటు మిగతా నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు చందు కథలోని సస్పెన్స్‌ని చాలా బాగా మెయింటైన్ చేశాడు.
శ్రీకృష్ణుడి ద్వారక నేపథ్యం
వీటన్నింటికీ మించి ఈ సినిమాకి ప్రధాన బలం ఏమిటంటే ఇది శ్రీకృష్ణుడి ద్వారక నేపథ్యంలో రూపొందింది. అలాగే దర్శకుడు చందు రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం సరికొత్త అనుభూతినిస్తుంది. ఇక సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతల నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
సూపర్ నేచురల్ థ్రిల్లర్
‘కార్తికేయ 2’ అనే ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ముఖ్యంగా దర్శకుడు చందు రాసుకున్న కథ, అడ్వెంచర్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ సినిమాకు ఆకట్టుకునే అంశాలు. ఓవరాల్ గా డిఫరెంట్, కొత్త తరహా సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.