Karnataka: దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇవాళ ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే సాగిపోయింది. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూలైన్‌లో వేచి ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఓవరాల్‌గా పోలింగ్ శాతంపై అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్నఅంశంపై ఇప్పుడు విస్తృతంగా చర్చ కొనసాగుతోంది.
మొన్నటి దాకా రాజకీయ పార్టీలన్నీ భారీగా ప్రచారం నిర్వహించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తదితర అగ్ర నేతలంతా విస్తృత ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు పాట్లు పడ్డారు. దాదాపు చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్‌లో సైతం పలు సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని కుండబద్దలు కొడుతున్నాయి.
ఇక కన్నడ నాట ఏ పార్టీకి ఓటరు జై కొట్టాడన్నది రెండు రోజులుల్లోనే తేలిపోనుంది. ఈ తరుణంలో కర్ణాటకలో గెలుపెవరిదనే విషయంపై పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి.
ఏబీపీ-సీఓటర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. మొత్తం సీట్లు – 224లో, బీజేపీ- 83 నుంచి 95 సీట్లు, కాంగ్రెస్- 100 నుంచి 112 సీట్లు, జేడీఎస్ – 21 నుంచి 29 సీట్లు, ఇతరులు- 2 నుంచి 6 సీట్లు వచ్చే చాన్స్ ఉందని ఆసర్వే స్పష్టం చేసింది.
మరోవైపు జీన్యూస్-మ్యాట్రైజ్ సంస్థ చెప్పిన ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం.. కాంగ్రెస్‌కు 103-118 సీట్లు, బీజేపీకి 79-94 సీట్లు, జేడీఎస్‌కు 25-33 సీట్లు, ఇతరులకు 2-5 సీట్లు వస్తాయని ఆ సర్వే తెలిపింది.
మరోవైపు కాంగ్రెస్‌కు అధికారం చేపట్టాలంటే 113 సీట్లు కావాలి. అయితే, సంపూర్ణంగా కాంగ్రెస్‌కు ఆధిక్యం రాకపోయినా ఈసారి కూడా జేడీఎస్‌తో కలిసి అధికారాన్ని ఫాం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also : Priyanka Gandhi: హైదరాబాద్‌లో ప్రియాంకా గాంధీ.. యువ సంఘర్షణ సభలో ఏం మాట్లాడారంటే..