Siddaramaiah : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం (జూన్ 11) నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది. సిద్దరామయ్య ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళల కోసం ఉచిత ప్రయాణ పథకం ‘శక్తి యోజన’ను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రారంభించనున్నారు. దీని కోసం ఆదివారం సీఎం కండక్టర్ అవతారంలో రానున్నాడు . బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్ నుంచి విధానసౌధ మార్గంలో వెళ్లే బస్సులో కండక్టర్‌గా మారనున్నాడు.
బస్సులోనే మహిళలకు స్మార్ట్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఎంటీసీ బస్సుకు సిద్దరామయ్య కండక్టర్‌గా వ్యవహరిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రూట్ నంబర్ 43 లో బస్ కండక్టర్లుగా మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేస్తామని, అనంతరం విధానసౌధలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శక్తి యోజనను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాల్లో ఏకకాలంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
read more news :
Uttar Pradesh News : ఇంజెక్షన్ ఇచ్చి యువతిపై అత్యాచారం..!
Niharika Konidela : ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నా! వెల్‌కమ్ వదినా.. నీహారిక పోస్ట్