Karate Kalyani: కరాటే కళ్యాణి ఒకప్పుడు నటిగా మాత్రమే వార్తలలో నిలుస్తుండేది. కాని ఇటీవల మాత్రం ఎక్కువగా వివాదాలతో హాట్ టాపిక్ అవుతుంది. బిగ్ బాస్ లోకి కూడా వెళ్లిన కరాటే కళ్యాణి అక్కడ కూడా తన ప్రవర్తనతో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. అయితే కళ్యాణి ఈ మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఏర్పాటు చేయడాన్ని తప్పు పడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఎన్టీఆర్ శత జయంతి పురస్కరించుకుని ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఖమ్మంలో ఆవిష్కరించబోతుండగా, ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి గెటప్ లో ఆవిష్కరించడాన్ని పలువురు తప్పు పట్టారు. అందులో కరాటే కళ్యాణి కూడా ఉన్నారు.. అయితే ఒక వ్యక్తి విగ్రహాన్ని హిందువులు పరవమ పవిత్రంగా కొలిచే శ్రీకృష్ణుడి గెటప్ లో ఎలా ఆవిష్కరిస్తారు అంటూ యాదవ సంఘాలు కోర్టుని కూడా ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది.
అయితే ఈ విషయంపై కరాటే కళ్యాణి మాట్లాడుతూ..ఎన్టీఆర్ ఎవరికి దేవుడు, ఏ వర్గానికి ఆయన దేవుడు.. దేని కోసం ఆయన్ని దేవుణ్ణి చేస్తున్నారు అని ప్రశ్నించింది.. ఒక వ్యక్తిని సాక్షాత్తు శ్రీకృషుడితో పోల్చడం, ఆయన రూపాన్ని ఆపాదించడం ఏంటి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన ఎన్టీఆర్‌పై కరాటే కళ్యాణి అలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆమెని మా సస్పెండ్ చేసింది.
ఈనెల 16న అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని ‘మా’ షోకాజ్ నోటీసు పంపగా, మూడు రోజుల్లో స్పందించాలని గడువు కూడా ఇచ్చింది. అయితే, ఇచ్చిన గడువులో వివరణ ఇవ్వకపోగా.. ‘మా’కు కరాటే కళ్యాణి లీగల్ నోటీసు పంపడంపై అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మా’ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకున్నందుకు గాను కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకుంటూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ సస్పెన్షన్ నోటీసు పంపారు.
దీనిపై స్పందించిన కళ్యాణి.. ప్రతి హీరోకి దేవుడి రూపంలో విగ్రహం పెడితే దేవుళ్లు ఎందుకు మరి.. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి ఆయన రూపాన్ని అవమానించడం కరెక్టా.. అక్కడ ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే దేవుడికి అన్యాయం జరిగినట్టే కదా.. ఇవన్నీ భావించి నేను విగ్రహం పెట్టొద్దని అన్నాను. అయితే నాకు షోకాజ్ నోటీసు ఇచ్చిన తరవాత మూడు రోజుల సమయం ఇచ్చారని.. అయితే, నాకు గొంతు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక ఉన్నాను.
షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే మళ్లీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని తన లాయర్‌కు చెప్పి కొంత టైమ్ కావాలంటూ ఒక నోటీసు రాసి పంపించాను. దాన్ని వారు లీగల్ నోటీసుగా భావించి సస్పెండ్ చేశారంటూ కళ్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. ‘23 సంవత్సరాలుగా నేను ఇండస్ట్రీలో ఉన్నాను. ఎవరు, ఎప్పుడు, ఏం మాట్లాడినా నేనే అడ్డుపడి.. పూసుకుని, రాసుకుని నా ఇండస్ట్రీ, నా ఇండస్ట్రీ అని ముందుకు వెళ్లాను. అలా వెళ్లినందుకు నా నిజాయతీకి, సిన్సియారిటీకి చాలా మంచి గిఫ్టే ఇచ్చారు. నా నిజాయితీని తప్పక ప్రూవ్ చేసుకుంటానంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.
read more articles :
Ashish Vidyarthi : 60 ఏళ్ల వయస్సులో ప్రేయసిని పెళ్లాడిన పోకిరి విలన్