Kantara: ఒకే ఒక్క సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు రిషబ్ శెట్టి. కాంతార సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా ఇందులో నటించి అందరి ప్రశంసలు పొందాడు. కేవలం రూ. 16 కోట్లతో రూపొందిన కాంతార.. వరల్డ్ వైడ్ రూ. 400 కోట్లు వసూల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ దర్శకుడు ‘కాంతార 2’ సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. దీంతో ఇప్పుడు రిషబ్ శెట్టిపై, కాంతార 2పై ప్రేక్షకులలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి అని చెప్పాలి.
తాజాగా రిషబ్ శెట్టి తదుపరి సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి, లైగర్ సినిమాలతో పాన్ ఇండియా ఫేమ్ సొంతం చేసుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రెజెంట్ శివ నిర్వాణతో ఖుషి సినిమా చేస్తూనే.. గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా, పరశురామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే అల్లు అరవింద్ నిర్మాణంలో కూడా విజయ్ ఓ సినిమా చేయనున్నాడట. ఈ సినిమా కోసం కాంతార దర్శకుడు రిషబ్ శెట్టిని రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇదే కన్ఫర్మ్ అయితే మాత్రం, విజయ్ కెరీర్ కి ఈ సినిమా మంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.
also read :
H-1B Visa : ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారులకు గ్రేస్ పీరియడ్ పెంచనున్న యూఎస్!