Kantara : ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే ఒక్క సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఆ సినిమా ఏదంటే రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత మిగతా భాషలలో కూడా విడుదలై పెద్ద విజయం సాధించింది. ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే ఈ సినిమా పెద్ద హిట్ అయింది.
కాంతారా చిత్రానికి వచ్చినంత మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ టాక్ మరే చిత్రానికి కూడా రాలేదనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో కాంతారా చిత్రం అందరినోళ్లలో నానుతోంది. కన్నడలో ప్రభంజనం సృష్టించిన కాంతారా చిత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేస్తుండడం విశేషం.
కంగానాకి కాంతారా (Kantara) నచ్చింది..
ఇక కాంతారా దెబ్బకు అన్ని ఇండస్ట్రీలు షాక్ అవుతున్నాయి. రిషభ్ శెట్టి నటన, డైరెక్షన్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ సెన్సేషనల్ నటి కంగనా రనౌత్ తన ఫ్యామిలీతో కలిసి కాంతారా సినిమాని వీక్షించింది.
ఇక ఈ చిత్రం చూశాక మూవీపై పొగడ్తల వర్షం కురిపించకుండా ఉండలేకపోయింది. సినిమా చూసిన తర్వాత తన కారు లో సెల్ఫీ వీడియో చేయగా, ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Kangana Ranaut is all praise for #Kantara after watching the film in theaters.#KanganaRanaut #KantaraMovie pic.twitter.com/Qya9Ghizb3
— Kangana Ranaut Daily (@KanganaDaily) October 20, 2022
ఇందులో కంగనా మాట్లాడుతూ.. “నేను మా కుటుంబంతో కలిసి కాంతారా సినిమా చూశాను. సూపర్బ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా నేను ఆ సినిమా మూడ్‌లొనే ఉన్నాను. రిషబ్ శెట్టి, మీకు హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన, యాక్షన్ అన్ని బ్రిలియంట్.
ఈ చిత్రంలో యాక్షన్ మరియు స్థానిక జానపద కథల సమ్మేళనం చాలా బాగా చూపించారు. సినిమా అంటే ఇది. అందమైన ఫొటోగ్రఫీ, యాక్షన్ , సంప్రదాయం, జానపథ కథలు ఇలా అన్ని మిళితం అయి ఉన్నాయి. తాము ఇలాంటి సినిమాలు ఎప్పుడూ చూడలేదని థియేటర్‌లో చాలా మంది చెప్పడం నేను విన్నాను. ఈ చిత్రాన్ని తీసిన మీకు ధన్యవాదాలు.
మరో వారం రోజుల వరకు నేను ఈ మూడ్ నుంచి కోలుకోలేనని అనుకుంటున్నాను అని కంగనా పేర్కొంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ అయిన ఈ చిత్రం రిలీజైన ప్రతీ చోట కలెక్షల వర్షం కురిపిస్తున్నది.
వర్కింగ్ డే, హాలీడే అనే తేడా లేకుండా దండిగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఇప్పటికే 150 కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం 200 కోట్లు కూడా రాబట్టనుందని చెబుతున్నారు.
ఇవి కూడా చూడండి :
పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలంటే ఈ చిట్కాలు పాటించండి.