kangana ranaut tweet : కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తుంటుంది కంగనా రనౌత్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లనే కాక రాజకీయ నాయకులని సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తుంటుంది. సుశాంత్ సింగ్ మరణం తర్వాత కంగనా రనౌత్ బాలీవుడ్ పై విరుచుకుపడింది.
బాలీవుడ్ మాఫియా అతని అవకాశాలు లాగేసుకొని మానసిక వేదనకు కారణమయ్యేలా చేసిందంటూ విమర్శలు గుప్పించింది. ఇక మధ్య మధ్యలో తన సోషల్ మీడియా ద్వారా పలు సంచనల కామెంట్స్ కూడా చేసింది.
కంగనా తాజా ట్వీట్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతుంది. ఆమె హీరో హీరోయిన్స్ ని టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ”ఈ బాలీవుడ్ మాఫియా నా యాటిట్యూడ్ ని తలపొగరుగా చిత్రీకరిస్తూ నన్ను తొక్కే ప్రయత్నం చేస్తుంది. నేను మిగతా హీరోయిన్స్ మాదిరిగా కులకుతూ ఎంటర్టైన్ అస్సలు చేయను. ఐటమ్స్ సాంగ్స్ చేయను. చీరలు కట్టుకొని డాన్సులు చేయను. హీరోలు పిలవగానే వెళ్లి రాత్రుళ్ళు వాళ్ళు ఉండే గదుల్లో గడపను. ఈ కారణాల వల్లనే నన్ను ఒక పిచ్చిదానిగా ప్రొజెక్ట్ చేసి జైలుకి పంపాలని చూస్తున్నారు అంటూ సంచలన ట్వీట్ చేసింది కంగనా. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.
Bhikhari film mafia ne mere attitude to mera arrogance kaha, kyunki main dusari ladkiyon ki tarah giggle karna, item number karna, shaadiyon pe nachna, raat ko bulaaye jaane pe heros ke kamron mein jana yeh sab keliye saaf mana kiya, they declared me mad and tried to jail me1/2
— Kangana Ranaut (@KanganaTeam) February 27, 2023
also read news :
Curd with Sugar : పెరుగులో చక్కెర కలిపి తింటే ప్రమాదమా?
hair colour : శిరోజాలకు రంగు వేసుకునే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు..