HomesportsKane williamson: కేన్ మామ గుండె చాలా గ‌ట్టిదే.. నాలుగు సార్లు నిరాశ ఎదురైన న‌వ్వు చెద‌ర‌లేదు..!

Kane williamson: కేన్ మామ గుండె చాలా గ‌ట్టిదే.. నాలుగు సార్లు నిరాశ ఎదురైన న‌వ్వు చెద‌ర‌లేదు..!

Telugu Flash News

Kane williamson: ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ 20 ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ దారుణంగా భారీ ఓటమి పాలైంది. టైటిల్ ఫేవ‌రేట్‌గా బ‌రిలోకి దిగిన ఆ జ‌ట్టు మొద‌టి నుండి గ‌ట్టిగానే ఆడుతూ వ‌చ్చింది. న్యూజిలాండ్ ఆట తీరు చూస్తే ఈ సారి సెమీస్ చేర‌డం ప‌క్కా అని అంద‌రు భావించారు. కాని సెమీస్‌లో పాకిస్తాన్ చేతిలో దారుణంగా ఓడి ఇంటి బాట ప‌ట్టింది. వరుసగా ఐదో ప్రపంచకప్ టోర్నీలోనూ ఆ జట్టు టైటిల్ అందుకోలేకపోవ‌డంతో ఫ్యాన్స్ నిరాశ‌లో ఉన్నారు. 2015 నుంచి ప్రతీ ప్రపంచకప్‌లో నాకౌట్ చేరుతున్నప్ప‌టికీ టైటిల్‌ని మాత్రం ముద్దాడ‌లేక‌పోతుంది. 2015 ప్రపంచకప్ ఫైనల్ ఓటమి అనంతరం ప్రతీ ఐసీసీ టోర్నీలో (2017 ఛాంపియన్స్ ట్రోఫీ మినహా) నాకౌట్ దశ ధాటిన కివీస్.. విశ్వ విజేత కిరీటం ద‌క్కించుకోలేక‌పోయింది.

గ‌ట్టి గుండె..

కేన్ విలియమ్సన్ సారథ్యంలో ఆ జట్టు నాలుగు సార్లు టైటిల్ చేజార్చుకోవ‌డం విశేషం. రెండు సార్లు సెమీఫైనల్లో న్యూజిలాండ్ టీం వెనుదిరగ్గా.. మరో రెండు సార్లు ఫైనల్లో చేతులెత్తేసింది. కొన్ని సార్లు ఆ జ‌ట్టుని దురదృష్టం కూడా వెంటాడింది. భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఖంగుతిన్న ఆ జట్టు.. 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అనైతిక నిబంధనలతో టైటిల్ ద‌క్కించుకోలేక‌పోయింది. దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి తృటిలో టైటిల్ చేజార్చుకుంది.

తాజా టోర్నీ సెమీఫైనల్లో పాకిస్థాన్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలై ఇంటిదారి పట్టింది. ఈ నాలుగు సార్లు ప్రతికూల ఫలితం వచ్చినా కేన్ విలియమ్సన్ ముఖంలో మాత్రం ఎన్న‌డు చిరునవ్వు చెరగలేదు. నాలుగు టోర్నీల్లో తృటిలో టైటిల్ చేజారినా.. ఏ మాత్రం సడలని అతని గుండె ధైర్యం గొప్పదని ఫ్యాన్స్ అంటున్నారు. మిగ‌తా ఆట‌గాడు అయితే పూర్తి నిరాశ చెంది కెరీర్‌కి గుడ్ బై చెప్పేవాడ‌ని, కేన్ మామ మాత్రం సన్నగిల్లని అతని ఆత్మవిశ్వాసం ప్రతీ ఒక్కరికి స్పూర్తి దాయకంగా నిలిచాడ‌ని చెప్పుకొస్తున్నారు. వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అయిన కివీస్‌ని కేన్ మామ విజ‌య‌ప‌థంలోకి తీసుకెళితే చూడాల‌ని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News