Telugu Flash News

kalyan ram tattoo : త‌న టాటూ సీక్రెట్ బ‌య‌పెట్టిన క‌ళ్యాణ్ రామ్

Kalyan Ram: నందమూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టించిన తాజా చిత్రం అమిగోస్. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 10న విడుద‌ల కానుండ‌గా, ఈ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ జ‌రుగుతున్నాయి.అయితే బింబిసారలో డబుల్ రోల్ చేసిన కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అమిగోస్ సినిమాలో ట్రిపుల్ రోల్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్.. సినిమాతో పాటు తన పర్సనల్ లైఫ్ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా తన భార్య గురించి గొప్పగా మాట్లాడారు. మొదటిసారి చేతిపై భార్య స్వాతి పేరు పచ్చబొట్టు వేయించుకోవడం వెనకున్న కథను రివీల్ చేశారు.

“2007-08 మధ్య నేను అనారోగ్యానికి గురయ్యాను. ఆరోగ్యం అస్సలు బాలేదు. అప్పుడు అందరి భర్త పట్ల కేర్ తీసుకుంటారు.. కొందరు నర్సులను పెట్టి చూసుకోమని చెప్పేస్తారు. కానీ, నా విషయానికొస్తే.. ఆ నర్సులను కూడా వద్దని, తానే దగ్గరుండి చూసుకుంది.

మా 10వ మ్యారేజ్ డే రోజున నీకేం కావాలో చెప్పు.. ఏదైనా ఇస్తాను అని అడిగాను. కానీ, నా భార్య తనకేం వద్దని.. మీరు, పిల్లలు ఉన్నారు చాలు అంది.

అప్పుడు నాకు తన పేరు టాటూ వేయించుకోవాలని అనిపించింది అని క‌ళ్యాణ్ రామ్ త‌న భార్య‌పై ఉన్న ప్రేమ‌ని బ‌య‌ట‌పెట్టారు..

also read :

Fruits to Help You Sleep : ఈ ఫ్రూట్స్‌ తింటే హాయిగా నిద్ర పడుతుంది

Janhvi Kapoor : ఎన్టీఆర్ సినిమాతోనే జాన్వీ క‌పూర్ ఎంట్రీ..!

 

Exit mobile version