Bimbisara Review : నందమూరి ఫ్యామిలీకి చెందిన మరో నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా ని ఈరోజు విడుదల చేస్తున్నారు. 500 సంవత్సరాల క్రితం జీవించిన బింబిసార రాజు ఒక లక్ష్యం కోసం ఆధునిక ప్రపంచానికి ప్రయాణించాడు, అతను దానిని పూర్తి చేశాడా లేదా? అన్నదే ఈ సినిమా కథ. సంయుక్తా మీనన్, కేథరిన్ థెరిసా, వరినా ఉసేన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి అభిమానులు ట్విట్టర్‌లో ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారో..
బాహుబలి లాగా :
బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా చాలా రాజుల కథలు రీక్రియేట్ అవుతున్నాయి. టాలీవుడ్‌లో కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నిదానంగా మొదలై 20 నిమిషాల తర్వాత పుంజుకున్న బింబిసార కథపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బింబిసార టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో బాక్సాఫీస్ హిట్ అవుతుందని అభిమానులు మరియు సినీ పరిశ్రమ ఎదురు చూస్తున్నారు.
బింబిసార కథ :
బింబిసార (కల్యాణ్ రామ్) 500 BC కి ముందు త్రిగర్తల సామ్రాజ్యాన్ని చాలా క్రూరంగా పరిపాలిస్తాడు. ఎలాంటి జాలి, కనికరం లేకుండా కోరుకున్నది పొందే క్రమంలో బింబిసార ఊహించని శాపానికి గురవుతాడు. దీంతో అక్కడి నుంచి ప్రస్తుతానికి వస్తాడు. మరి గతం నుంచి ఈ ఆధునిక యుగానికి వచ్చిన బింబిసారుడికి ఎదురైన సవాళ్లు ఏమిటి? అతని శాపం ఏమిటి? చివరికి ఎప్పటికైనా తన కాలానికి వెళ్లిపోతాడా లేక ఈ ఆధునిక ప్రపంచంలోనే ఉండిపోతాడా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఈ సినిమా వెండితెరపై చూడాల్సిందే.
టైమ్ ట్రావెల్ :
చాలా మంది వ్యక్తులు సాధారణంగా భవిష్యత్తు నుండి వర్తమానానికి, లేదా వర్తమానం నుండి గతానికి లేదా భవిష్యత్తుకు టైమ్ ట్రావెల్ చేస్తారు. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ బింబిసార చిత్రంలో గతం నుండి వర్తమానానికి వస్తాడు. తక్కువ బడ్జెట్ తో చిత్రం పూర్తి చేశారంటూ పలువురు కొనియాడుతున్నారు.
కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం
మొత్తానికి ఈ “బింబిసార”తో చిత్ర యూనిట్ కోరుకున్న విజయంతో పాటు టాలీవుడ్ ఎదురుచూస్తున్న హిట్ కూడా వచ్చిందనే చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం, సినిమా విజువల్స్, సంగీతం అన్నింటికీ మించి దర్శకుడు మల్లిడి వశిష్ట్ చిత్తశుద్ధితో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ వారాంతంలో మీ కుటుంబ సమేతంగా చూడడానికి ఈ సినిమా తప్పకుండా సాలిడ్ ట్రీట్ ఇస్తుంది. మిస్ అవ్వకండి..
Hearing great things about #Bimbisara. It feels good when people enjoy a film with the sort of enthusiasm we felt while watching it for the first time.
— Jr NTR (@tarak9999) August 5, 2022
#BIMBISARA is 👍✌️🤙🤙🔥
A good combination of Fantasy Action Emotion Music and Visuals @NANDAMURIKALYAN garu must be appreciated for portraying two shades of character fantastic & believing Young potential talent @DirVassishta making this filmWatch it on THEATERS pic.twitter.com/D5Q3bzJtxH
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) August 5, 2022