Telugu Flash News

Kalki 2898 AD : కల్కి 2898ఎడి టీజర్ రన్ టైం ఖరారు!

prabhas in kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898ఎడి”(Kalki 2898 AD) . దిశా పటాని, దీపికా పదుకోణ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ సహా ప్రపంచ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికర టీజర్ రాబోతోంది అని తెలిసింది. ఈ టీజర్ రన్ టైం 1 నిమిషం 23 సెకన్లు అని సమాచారం. ప్రస్తుతం ఈ టీజర్ పై పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీజర్ రిలీజ్ డేట్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం మే 9న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Exit mobile version