HomecinemaKalki 2898 AD: రాజమౌళి ప్రశంసలు, ప్రభాస్ నటన అద్భుతం!

Kalki 2898 AD: రాజమౌళి ప్రశంసలు, ప్రభాస్ నటన అద్భుతం!

Telugu Flash News

Rajamouli Review on Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ మొత్తం ప్రపంచాన్ని చుట్టేసిన వేళ దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమా చూసి తన రివ్యూ ఇచ్చాడు. గురువారం (జూన్ 27) మూవీ రిలీజ్ కాగా..

తొలి రోజే చూసి ఎక్స్ అకౌంట్ ద్వారా తన అభిప్రాయం చెప్పాడు. డార్లింగ్ చంపేశావ్ అంటూ ప్రభాస్ ను కొనియాడగా.. మొత్తం సినిమా తననో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు తెలిపాడు.

రాజమౌళి కల్కి 2898 ఏడీ రివ్యూ

తెలుగువాడైనా మొత్తం ఇండియాకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు ఇచ్చిన దర్శకుడు రాజమౌళి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మరో సినిమాను చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఆ మూవీ పేరు కల్కి 2898 ఏడీ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని తన మానియాతో ఊపేసిన ఈ సినిమా.. ఇప్పుడు రాజమౌళిని కూడా కట్టి పడేసింది.

మూవీ చూసిన తర్వాత సోషల్ మీడియా ఎక్స్ లో అతడు తన రివ్యూ ఇచ్చాడు. “కల్కి 2898 ఏడీ వరల్డ్ నిర్మించిన తీరు బాగా నచ్చింది. అత్యద్భుతమైన సెటింగ్స్ తో ఇది నన్ను వివిధ ప్రాంతాలకు నన్ను తీసుకెళ్లింది. తన టైమింగ్, ఈజ్ తో డార్లింగ్ చించేశాడు. అమితాబ్ జీ, కమల్ సర్, దీపికా నుంచి మంచి సపోర్ట్ లభించింది. చివరి 30 నిమిషాల సినిమా నన్ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దీనిని తెరపైకి తీసుకొచ్చేందుకు నాగి (డైరెక్టర్ నాగ్ అశ్విన్), మొత్తం వైజయంతీ టీమ్ కు నా శుభాకాంక్షలు” అని రాజమౌళి ట్వీట్ చేశాడు.

కల్కి 2898 ఏడీ ఎలా ఉందంటే?

నిజానికి కల్కి 2898 ఏడీ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కొన్నేళ్లుగా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసినా అందుకు తగిన అనుభూతి దక్కినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ కు ఫిదా అవుతున్నారు. హిందూ పురాణాలకు సైన్స్ ను ముడిపెట్టి హాలీవుడ్ రేంజ్ లో తీసిన ఈ సినిమా రాజమౌళి చెప్పినట్లు నిజంగానే మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

-Advertisement-

ఫస్ట్ హాఫ్ లో కాస్త అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించినా.. సెకండాఫ్ చివరికి వచ్చేసరికి మూవీ మరో స్థాయికి వెళ్లింది. ప్రభాస్, అమితాబ్ మధ్య ఫైట్లు.. కమల్ విలనిజం, దీపికా నటన, అత్యున్నత ప్రమాణాలతో ఉన్న విజువల్స్ తో ఈ సినిమా ఓ అద్భుతం అని అంటున్నారు.

భైరవగా తన కామెడీ టైమింగ్‌తో ప్రభాస్ మెప్పించాడు. సూపర్ హీరోగా అతడి క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్‌. ప్రభాస్‌పై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. ప్రభాస్ క్యారెక్టర్‌కు ధీటుగా అశ్వత్థామ పాత్రను రాసుకున్నాడు దర్శకుడు. అమితాబ్‌బచ్చన్ డైలాగ్ డెలివరీ, అతడి స్క్రీన్‌ప్రజెన్స్ వావ్ అనిపిస్తాయి అని హిందుస్థాన్ టైమ్స్ తెలుగు తన రివ్యూలో చెప్పింది. ఓవరాల్ గా ఇది మరో రూ.1000 కోట్ల సినిమా అని చూసిన ప్రేక్షకులు కూడా తేల్చేశారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News