HomecinemaKajal Aggarwal: బాబోయ్.. కాజ‌ల్ కూడా ఇంత రెచ్చిపోతుందేంటి.. ముద్దుల‌తో ముంచేస్తుందిగా..!

Kajal Aggarwal: బాబోయ్.. కాజ‌ల్ కూడా ఇంత రెచ్చిపోతుందేంటి.. ముద్దుల‌తో ముంచేస్తుందిగా..!

Telugu Flash News

Kajal Aggarwal: క‌లువ క‌ళ్ల సుందరి కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాజ‌ల్ పెళ్లి త‌ర్వాత కాస్త స్లో అయింది. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ‌. ఆ తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామతో మరింత పాపులారిటీ ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమా అవకాశాలు ద‌క్కాయి. టాలీవుడ్ స్టార్ హీరోల‌ల న‌టించి మంచి హిట్స్ అందుకున్న కాజ‌ల్ టాప్ హీరోయిన్ రేంజ్‌కి కూడా ఎదిగింది. ఇక అది అలా ఉంటే కాజల్ తన భర్తతో ఇటీవల ఓ ఈవెంట్‌కు హాజరు కాగా, అక్కడ అందరి ముందే భర్తకు లిప్ లాక్ ఇచ్చి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

పెళ్లి తర్వాత కాజల్ ఎక్కువగా తన భర్త, కొడుకుతోనే లైఫ్ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంటుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఈ అమ్మడు కాస్త బరువెక్కినా.. ఇటీవల ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కోంత స్లిమ్ గా మారింది. అయితే ఈ మ‌ధ్య సినిమా ఇండస్ట్రీకి కాజల్ అగర్వాల్ కొంత కాలం బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఫ్యాన్స్ తో మాత్రం ఏదో విధంగా ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటు వచ్చింది. తన వ్యక్తిగ‌త విషయాలకు సంబంధించిన ప్రతి విషయం ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. 2020 లో ప్రముఖ వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తాను ప్రెగ్నెన్సీ.. తన కొడుకు నెయిల్ కిచ్లూకీ జన్మనివ్వడం వరకు ప్రతీ విషయాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్.

అయితే కాజ‌ల్ ఈ మ‌ధ్య ఎక్క‌డికి వెళ్లిన కూడా భ‌ర్త గౌత‌మ్ తో వెళుతూ తెగ సంద‌డి చేస్తుంది. రీసెంట్‌గా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ మూవీ ‘చత్రపతి’ సెలబ్రిటీ ప్రీమియర్ కోసం కాజల్ తన భర్తతో క‌లిసి అక్క‌డికి వెళ్లింది. బ్లాక్ డ్రెస్ లో కళ్లు చేదిరే అందంతో హోయ‌లు పోయిన ఈ అమ్మ‌డు ఆ త‌ర్వాత తన భర్తను ముద్దుల్లో ముంచెత్తింది. కెమెరా ముందే భర్త గౌతమ్ కి ఘాటైన లిప్ కిస్ ఇస్తూ తన ప్రేమను ఇలా చూపించింది.. ఇద్దరూ గట్టిగా కౌగిలించుకుని లిప్ లాక్ ముద్దుకి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. ఇటీవల ఈ అమ్మ‌డు తన భర్తతో రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలో మెరిసిన విష‌యం తెల‌సిందే. ఇక కాజ‌ల్ ప్రస్తుతం క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న‌ ఇండియన్2 మూవీ లో నటిస్తుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో న‌టిస్తుంది. అలానే తెలుగులో బాల‌య్య 108వ‌ సినిమాలో నటిస్తోంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News