kajal agarwal :కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరు అన్న విషయం తెలిసిందే. చందమామ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన కాజల్ ఆ తర్వాత స్టార్ హీరోలతో జతకడుతూ వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లింది. ఇటీవల కుమారుడు నీల్ కి జన్మనిచ్చిన కాజల్, ఎక్కువగా సమయాన్ని కుటుంబంతో అలానే కుమారుడితో గడుపుతూ సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా కాజల్ మాట్లాడుతూ, తన కుమారుడు నీల్ కి ఎనిమిదేళ్ల వయసు వచ్చే వరకు సినిమాలకు దూరంగా, అలానే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి అందించకుండా పెంచాలని తాను భావిస్తున్నట్టు కాజల్ తెలిపింది. ఇక అతడికి సినిమా చూపిస్తే తొలిసారిగా విజయ్ హీరోగా తాను నటించిన తుపాకీ సినిమా చూపించాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. మురుగదాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో మనందరికి తెలిసిందే . ఇక ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ ల ఇండియన్ 2, బాలకృష్ణ 108 చిత్రంతో పాటు పలు సినిమా షూటింగ్స్‌తో కాజల్ బిజీగా ఉంది.
also read :
Viral Video : మైమరచిన ప్రేమికులు.. బైకు రన్నింగ్‌లో ఉండగా ముద్దులు, హగ్గులు..!
Saeed Anwar : మోదీపై పాక్ మాజీ క్రికెటర్ పైత్యపు మాటలు.. ట్విట్టర్‌లో వైరల్!
MLC Kavitha : లిక్కర్ స్కామ్‌లో కవితకు బిగుస్తున్న ఉచ్చు.. విచారణపై ఉత్కంఠ!