KA Paul On Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తాజాగా తెలంగాణలో హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ మూడో రోజు ఆయన పాదయాత్ర మహబూబాబాద్ జిల్లాలోని పెనుగొండ ప్రాంతం నుంచి ప్రారంభమైంది.
అయితే, పాదయాత్ర సందర్భంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. దీనిపై అటు బీఆర్‌ఎస్ నేతలతో పాటు పలువురు తీవ్రంగా స్పందిస్తున్నారు.
రేవంత్‌రెడ్డి తీరుపై ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రగతి భవన్‌ను కాల్చివేయాలన్న రేవంత్ రెడ్డిపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా రేవంత్ తీరు మారలేదని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలు లంచం ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నారంటూ పాల్ ఆరోపించారు. ఆ పదవి నుంచి రేవంత్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ పార్టీకి పాల్ సూచించారు.
రేవంత్‌రెడ్డి టెర్రరిస్టులా బిహేవ్ చేస్తున్నారని, చట్టానికి వ్యతిరేకంగా రోజూ మాట్లాడుతున్న వ్యక్తిని పీసీసీ పదవి ఇచ్చి గౌరవించారంటే మీరు చేస్తున్న భారత్ జోడో గోడో యాత్రకు ఉపయోగం ఏముందని కాగ్రెస్‌ను కేఏ పాల్ ప్రశ్నించారు. ఎవరు తప్పు చేసినా తాను ప్రశ్నిస్తానని కేఏ పాల్ అన్నారు.
ప్రగతి భవన్‌ను తగులబెట్టాలంటూ తీవ్రవాదిలా వ్యాఖ్యలు చేశారని, ఒక మెంబర్‌ఆఫ్ పార్లమెంట్ ఇలా మాట్లాడటం శోచనీయమన్నారు. వెంటనే రేవంత్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు రేవంత్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఇంటిపై నక్సలైట్లను బాంబులేయాలని పిలుపునిస్తావా? అంటూ రేవంత్ రెడ్డికి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సవాల్ విసిరారు.
రేవంత్ రెడ్డి ములుగులో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ఇప్పటికే పలుచోట్ల పీసీసీ అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
also read:
Viral Video : కమలా హ్యారిస్ భర్తకు జిల్ బైడెన్ లిప్ కిస్..
Dhanush Latest Movie Vaathi(Tamil) SIR (Telugu) Trailer