HomecinemaNTR:పుకార్ల‌కి పులిస్టాప్.. ఎన్టీఆర్ శ‌త జయంతి ఉత్స‌వాల‌కి ఆహ్వానం అందుకున్న ఎన్టీఆర్

NTR:పుకార్ల‌కి పులిస్టాప్.. ఎన్టీఆర్ శ‌త జయంతి ఉత్స‌వాల‌కి ఆహ్వానం అందుకున్న ఎన్టీఆర్

Telugu Flash News

NTR: గ‌త కొంత కాలంగా చంద్ర‌బాబు, బాల‌య్య‌.. జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నార‌నే ప్ర‌చారం న‌డిచింది. ఆ మ‌ధ్య జ‌రిగిన ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వానికి జూనియ‌ర్ ని ఆహ్వానించ‌క‌పోవ‌డంతో అది నిజ‌మ‌ని అంద‌రు అనుకున్నారు. కాని ఎట్ట‌కేల‌కు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20 కైతలాపూర్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ స్వ‌యంగా ఆహ్వానించారు. మే 20వ తేదీన హైదరాబాద్‌లో జయహో ఎన్టీఆర్ వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుండ‌గా, ఆ సంద‌ర్భంలో. ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు సావనీర్ అనే సాంగ్ విడుద‌ల చేయ‌నున్నారు.

అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా సావనిర్ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం అయి కార్య‌క్ర‌మం గురించి చ‌ర్చ‌లు చేస్తున్నారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్క‌ర‌ణికి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం రూపొందడంపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే కృష్ణుడి రూపంలో పెట్టడం పైనే మా పోరాటం అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయ ప్రయోజనం మేరకు విగ్రహం ఏర్పాటుచేస్తున్నారని, యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ ఎన్టీఆర్ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని కరాటే కల్యాణి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఇక ఎన్టీఆర్ ని రాజ‌కీయాల‌లోకి రావాల‌ని అభిమానులు ఆహ్వానిస్తున్నారు. అయితే స‌రైన స‌మ‌యం కోసం జూనియ‌ర్ చూస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు.ఇక ఈ నెల 28న ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించాలని అభిమానులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు సాగుతున్నాయి.. ఈ కార్యక్రమానికి తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమ వంతుగా సాయం అందించిన‌ట్టు తెలుస్తుంది. నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుచేస్తండ‌గా, ఈ విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొంటారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News