NTR: లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన నయనతార రీసెంట్గా విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకుంది.చాలాకాలంగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేశ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ తర్వాత వీరిద్దరు విహార యాత్రలకు వెళ్లడం, తెగ సరదాగా తిరగడం వంటివి చేశారు. అయితే రీసెంట్గా ఈ జంట కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నయనతార భర్త విఘ్నేష్ శివన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశాడు. ఇక తమ కుమారుల పేర్లను ఉయిర్, ఉలగమ్ అని పెట్టినట్టు పేర్కొన్నారు.
భలే గెస్ చేశాడు..
నయనతార, తాను అమ్మానాన్నలమయ్యాయని తెలియజేస్తూ.. కవలలు వచ్చిన తర్వాత తమ జీవితం ఎంతో ఉజ్వలంగా, మనోహరంగా ఉన్నట్టు అనిపిస్తోందని ఆయన తెలిపారు. దేవుడు డబుల్ గ్రేట్ అని కొనియాడిన ఆయన తమ ప్రార్థనలు, పూర్వీకుల దీవెనలతో తమకు అంతా మంచే జరిగినట్టు భావిస్తామని పేర్కొన్నారు. ఇక ఈ విషయం పక్కనబెడితే.. నయనతార కవలలకు తల్లయిన వేళ ఓ టాపిక్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. నయనతారకు కవల పిల్లలు పుడతారన్న విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేశారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
నయనతారకి కవలలు ఎలా పుడతారని ఎన్టీఆర్ కి ఎలా తెలుసు అనే విషయంపై చర్చ నడుస్తుంది. 2010లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్, నయనతార, షీలా కౌర్ హీరోహీరోయిన్లుగా ‘అదుర్స్’ అనే సినిమా రూపొందగగా, అందులో చారి పాత్రధారికి జతగా చంద్రకళ పాత్రలో నయనతార నటించి మెప్పించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్.. నయనతారకు కవల పిల్లలు పుడతారని బికినీ వేసిన నయనతారని చూసి చెబుతాడు. ఆమె చెప్పినట్టుగానే ఇప్పుడు నయనతార కవలలకు జన్మనివ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆమెకు కవలలు పుడతారని చారి చెప్పడం, ఇది అలా జరిగిందని అన్నారు.
#NTR eppudo cheppadu 😝 #Nayanthara #NayantharaVigneshShivan pic.twitter.com/rcmnOdNdCn
— CineCorn.Com By YoungMantra (@cinecorndotcom) October 9, 2022