Telugu Flash News

Viral Video: ఇదేం రిపోర్టింగ్ రా బాబు.. కండోమ్ చేతిలో పట్టుకొని యువ‌తి…

Viral Video: సోష‌ల్ మీడియాలో నిత్యం కొన్ని వేల కొద్ది వీడియోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండగా, వాటిలో కొన్ని జ‌నాల‌ని తెగ ఆక‌ర్షిస్తుంటాయి. ఒక్కొక్క‌రు వింత చేష్ట‌ల‌తో వెరైటీ ప‌నులు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంటారు. తాజాగా ఓ రిపోర్ట‌ర్ చేసిన ప‌ని చూసి అంద‌రు ముక్కున వేలేసుకున్నారు. వివ‌రాల‌లోకి వెళితే ఫ్లోరిడాలో కొన్నిరోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో అక్కడి ప్రాంతమంతా పూర్తిగా జలమయం అయిపోగా, కుండపోతగా కురుస్తున్న వర్షం వలన అక్కడి జనజీవనం ప‌రిస్థితి దారుణంగా మారింది. వాహ‌నాలు రోడ్డుకు మీద‌కు కూడా రాలేక‌పోయాయి.

ఏం తెలివమ్మ‌డు..

ఈ తుఫాను ప్ర‌భావంతో 60 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు కూడా తెలుస్తోంది. అక్కడ విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడడం, తిండి త‌ప్ప‌లు లేక ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డ‌డం జ‌రిగింది. అయితే అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను కొందరు జర్నలిస్ట్ లు వర్షంలోనే లైవ్ రిపోర్టింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఇంతలో NBC2 యొక్క కైలా గేలర్ అనే యువతి వర్షం లో ఆమె లోగో (మైక్) తడవకుండా ఉండేందుకు దానికి కండోమ్ ను తొడిగింది.

సాధారణంగా ఎవరైన వర్షంలో తడవకూడదని ప్లాస్టిక్ కవర్ లు పెట్టడం మనం చూస్తుంటాం. కానీ యువతి మాత్రం కాస్త ఓవ‌ర్‌గా థింక్ చేసి మైక్ కు కండోమ్ తొడిగీ మరీ రిపోర్టింగ్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ వీడియో చూసి అంద‌రు నోరెళ్ల‌పెడుతున్నారు. ఏం తెలివి తేట‌లు నీవి అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అస‌లు కండోమ్స్ ద‌గ్గ‌ర పెట్టుకొని ఏం చేస్తున్నావు అంటూ కొంద‌రు నెటిజ‌న్స్ ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైన ఈ వీడియో తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది.

 

Exit mobile version