Telugu Flash News

Jobs : నెలకు 4 లక్షల జీతం.. ఎవరూ ముందుకు రావడం లేదు.. కారణం ఏంటి?

scotland job with 4 lakh salary

Jobs with monthly salary ₹4 lakh lying vacant know why ? మనదేశంలో ప్రస్తుతం నిరుద్యోగం పెరిగింది. గ్రాడ్యుయేట్లు, పీజీలు చేసిన వారు కూడా ఉద్యోగాలు రాక చిన్న చిన్న కొలువులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు ఉద్యోగాల్లోనూ భారీ సంఖ్యలో పోటీ ఉండటంతో కొందరు యువకులు ఉద్యోగాలు రాక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగాలు రాక పెళ్లిళ్లు జరగక అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటుండటంతో పరిస్థితి కొన్నేళ్లుగా దిగజారుతోంది.

ప్రపంచ వ్యాప్తంగానూ నిరుద్యోగిత తాండవిస్తోంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగాలు తొలగిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అమెరికాలోని దిగ్గజ సంస్థలన్నీ వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్నాయి. లేఆఫ్స్‌ పేరిట ఒక్క మెయిల్‌తోనే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే, ఇలాంటి తరుణంలోనే స్కాట్లాండ్‌లో వింత పరిస్థితి వెలుగు చూసింది. నెలకు నాలుగు లక్షలకుపైగా జీతం ఇస్తామని ప్రకటన వెలువరించినా ఎవరూ ముందుకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

విహార యాత్రల ఖర్చు కూడా సంస్థే భరిస్తుంది.. ఉద్యోగ భద్రత, కంపెనీని వీడే ముందు భారీ ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పినా యువత నుంచి రెస్పాన్స్‌ రావడం లేదు. దీంతో సదరు సంస్థ తలలు పట్టుకుంటోంది. ఇన్ని సదుపాయాలు మనదేశంలో కల్పిస్తే ఇప్పటికి లక్షల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చి పడేవి. కానీ స్కాట్‌లాండ్‌లో మాత్రం ఓ చమురు సంస్థలో ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

స్కాట్‌లాండ్‌లోని అబెర్డీన్ తీరంలో నార్త్‌సీలో ఆఫ్‌షోర్ రిగ్గర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఒక కన్సల్టెంట్ సంస్థ ఉద్యోగం గురించి ప్రకటన విడుదల చేసింది. అర్హతలను చెబుతూ ఐదు ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఏడాదిలో ఆరు నెలలు.. రోజుకు 12 గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తెలిపింది. సదరు ఉద్యోగి అక్కడే రెండేళ్లు ఉండాలనుకుంటే మాత్రం ఉద్యోగం వీడే ముందు కోటి రూపాయల వరకు ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. ఇంత భారీ మొత్తంలో డబ్బు మూటగట్టుకోవచ్చని తెలిసినా ఎవరూ ఆసక్తి కనబర్చడం లేదు. దీంతో సంస్థ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. సముద్రం అడుగున భూమి పొరల్లోని చమురును వెలికితీసేందుకు ఉద్దేశించిన భారీ నిర్మాణాలను ఆఫ్‌షోర్‌ రిగ్స్‌గా పిలుస్తారు.

also read :

Prabhas : చిరంజీవి అడ్డాలో ప్ర‌భాస్ సినిమా షూటింగ్‌..

Nani : చ‌ర‌ణ్‌ని అవ‌మానించేలా మాట్లాడిన నాని.. చ‌ర్చ‌నీయాంశంగా మారిన కామెంట్స్

Exit mobile version