Telugu Flash News

Venu Madhav: తాగి ప‌డ్డ వేణు మాధ‌వ్‌ని ఆమె కాలుతో తన్నేసిందా?

Venu Madhav: ఏ పాత్ర‌ల‌లోనైన ఇట్టే ఒదిగిపోయే క‌మెడీయన్ వేణు మాధ‌వ్.1996లో విడుదలైన సంప్రదాయం సినిమాతో వేణు మాధవ్ వెండితెరకు పరిచయం కాగా, అంచెలంచెలుగా ఎదిగి స్టార్ కమెడియన్స్‌లో ఒకరిగా నిలిచాడు.

ఏడాదికి 20 సినిమాలకు పైగా చేసే వేణు మాధ‌మ్ దాదాపు ప్ర‌తి సినిమాలో ఏదో ఒక పాత్ర‌లో న‌టించి మెప్పించేవాడు. నటుడిగా దూసుకుపోతున్న తరుణంలో అనారోగ్యం బారిన ప‌డ్డ వేణు మాధ‌వ్… చిన్నగా సినిమాలు తగ్గించుకుంటూ వచ్చాడు. ఏడాదికి రెండు మూడు చిత్రాలు మాత్ర‌మే చేశాడు.

ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైంది..

2015 తర్వాత పూర్తిగా వెండితెరకు దూర‌మైన వేణు మాధ‌వ్ 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ కన్నుమూశారు. అయితే ఆయ‌న‌ అకాల మృతికి చెడు అలవాట్లే కారణమన్న ప్రచారం జరిగింది. విపరీతమైన ఆల్కహాల్, సిగరెట్ అలవాటు ఉండేదని, ఆ కారణంగా చనిపోయారనే ప్ర‌చారాలు జ‌రిగాయి.

కాని డెంగ్యూకి చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేయ‌డంతో, అది విషమించి ఊపిరితిత్తులు పాడైపోయాయి. ఆ కారణంగా వేణు మాధవ్ కన్నుమూశారని భార్య స్ప‌ష్టం చేశారు. అయితే త‌న కుటుంబం కోసం వేణు మాధ‌వ్ చాలానే కూడ‌బెట్టారు.

అయితే తాజాగా వేణు మాధ‌న్ గురించి ఓ న‌టి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మహాత్మా’ లాంటి సినిమాలతో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న జ‌య‌వాణి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

తాను ఏదైనా క్యారెక్టర్ లో ఒక్కసారి ఇన్వాల్వ్ అయితే అందులో నుంచి త్వరగా బయటకు రాలేనని చెప్పుకొస్తూ వేణు మాధ‌వ్ తో స‌న్నివేశం గురించి మాట్లాడింది. అదిరిందయ్యా చంద్రం సినిమాలో వేణుమాధవ్ రోడ్డు మీద తాగి పడిపోతే.. అతడిని లేపి ఇంటికి తీసుకెళ్లే సీన్ రిహార‌ల్స్ చేస్తుండ‌గా, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వేణుమాధవ్ ని కాలితో తన్నుకుంటూ తీసుకెళ్లాను. ఆ షాట్ ఓకే అయిపోయింది.

డైరెక్టర్ వచ్చి సీన్ లో తన్నడం లేదు కదా.. ఎందుకలా చేశావ్..? అని టెన్షన్ పడ్డారు. అదే సమయంలో వేణుమాధవ్ వచ్చి సీన్ చాలా బాగా చేశావ్ అని చెప్పడంతో అంతా కూల్ అయిపోయింది.

ఇవి కూడా చదవండి :

Abhinaya Sri : బిగ్ బాస్ నాకు అన్యాయం చేశాడంటున్న అభిన‌య‌శ్రీ.. ఇంత‌కు ఏం జ‌రిగింది?

Grapes: మ‌న ఆరోగ్యానికి ద్రాక్ష ప‌ళ్లు మంచితో పాటు చెడు కూడా చేస్తాయనే విష‌యం తెలుసా?

 

Exit mobile version