Viral Video: ఇప్పుడు అంతా రెస్టారెంట్ ఫుడ్‌కి అలవాటు పడ్డారు. మహిళలు కూడా జాబ్‌లు చేస్తుండడంతో సమయం దొరక్క రెస్టారెంట్ బాట పడుతున్నారు. దీంతో ఎన్నో రెస్టారెంట్స్ వెలుస్తున్నాయి. అంతేకాదు కస్టమర్స్‌ని ఆకర్షించేందుకు రెస్టారెంట్స్ వినూత్నమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
అయితే జపాన్‌లోని ఓ రెస్టారెంట్ కస్టమర్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా ఎవరైనా ఓ హోటల్‌కు వెళ్లితే తమ నచ్చిన వంటని ఆర్డర్ చేస్తారు. మనం తీసుకెళ్లిన వస్తువులతో వారు వండివ్వడం ఎక్కడ జరగదు. వాళ్ల రెస్టారెంట్లో ఉన్నవి చేసి ఇస్తారు. అయితే జపనీస్ రెస్టారెంట్ వినూత్న ప్రయోగానికి తెరలేపింది.
మజా పక్కా..
ఈ రెస్టారెంట్ ఆవరణలో ఉన్న కొలనులో కస్టమర్లు చేపలు పట్టుకునే అవకాశం ఉంది.. గాలాలేసి తాము ఇష్టపడే ఏ రకం చేపనైన పట్టి దానిని దీనిని రెస్టారెంట్ వారికి అందిస్తే చాలు వారు ఈ చేపను ఎంతో రుచికరంగా వండి వడ్డిస్తున్నారు.
సంబంధిత రెస్టారెంట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక ఇక్కడికి వచ్చిన కస్టమర్లు బోటులో లేక్‌లో తిరుగుతూ చేపల వేటకు దిగే ఛాన్స్ ఉంది.. చేపను పట్టేసిన వ్యక్తి పేరిట కొద్ది సేపు బాజాభజంత్రీలతో హంగామా చేస్తారు. అనంతరం రెస్టారెంట్ కిచెన్‌లో ఈ చేప వంటకం సిద్ధం అయి, సదరు చేపపట్టిన వ్యక్తి ఆరగించేందుకు సిద్ధం చేస్తారు.
అయితే మనం ఎంచుకున్న చేపను గాలమేసి పట్టుకుని ఆరగిస్తే ఆ మజా ఏ రకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మజా మనకు ఈ రెస్టారెంట్లో దొరుకుతుంది.
అయితే స్వయంగా చేప పట్టిన వ్యక్తికి బిల్లులో తగ్గింపు కూడా ఇస్తారట.. సాధారణంగా జపాన్‌లో పేరొందిన రెడ్ స్నాపర్ ఫిష్ ధర 4180 యెన్లు కాగా, గాలమేసి పట్టుకున్న చేప వంటకం ధర ఈ రెస్టారెంట్లో చాలా తక్కువగా ఉంటుందట. అది ఎంత అంటే 1810 యేన్లు మాత్రమే.
జపాన్‌లోని ఒసాకాలో వెలిసిన ఈ రెస్టారెంట్‌కు ఇప్పుడు జనం క్యూలు కడుతున్నారు. మీరు కూడా అటు వెళ్లినప్పుడు ఈ రెస్టారెంట్‌ని ఒక్కసారి సందర్శించి రండి.
read more :