Homecinemaబోనీ క‌పూర్ స్మోకింగ్ మాన్పించ‌డానికి త‌న ఆరోగ్యాన్నే ప‌ణంగా పెట్టిన శ్రీదేవి

బోనీ క‌పూర్ స్మోకింగ్ మాన్పించ‌డానికి త‌న ఆరోగ్యాన్నే ప‌ణంగా పెట్టిన శ్రీదేవి

Telugu Flash News

బాలీవుడ్ క్రేజీ క‌పుల్ బోని క‌పూర్- శ్రీదేవి జంట ఎంత అన్యోన్యంగా ఉండేవారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎక్క‌డికి వెళ్లిన ఇద్ద‌రు క‌లిసి వెళ్లేవారు. అయితే 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఊహించ‌ని ప్ర‌మాదంతో శ్రీదేవి క‌న్నుమూసింది.

త‌ల్లి మ‌ర‌ణంతో జాన్వీ క‌పూర్ చాలా కుంగిపోయింది. అయితే ప్ర‌స్తుతం త‌న తల్లి డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. మా అమ్మకి తాను బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు గౌరీ షిండే డైరెక్షన్లో నటించాలనే కోరిక ఉండేది . అది కూడా చూడకుండా ఆమె వెళ్లిపోయింది. అందుకే ఆ కోరికను తాను కచ్చితంగా తీరుస్తా… అంటూ ఎమోషనల్ అయ్యింది జాన్వీ కపూర్.

త‌న ఆరోగ్యాన్నే ప‌ణంగా పెట్టిన శ్రీదేవి

ఇక త‌న తండ్రి స్మోకింగ్ గురించి మాట్లాడుతూ.. నాన్న సిగ‌రెట్స్ ఎక్కువ‌గా తాగేవారు. ఆయ‌న స్మోకింగ్‌ని ఆపడానికి తన తల్లి శ్రీదేవి నాన్ వెజ్ తినడం మానేసిందని జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

శ్రీదేవి ‘బలహీనంగా’ ఉన్నందున వైద్యులు నాన్ వెజ్ తినమని ఆమెకు సలహా ఇచ్చినప్పటికీ, త‌న తండ్రి సిగెర‌ట్స్ తాగ‌డం మాన్పించ‌డానికి వెజిటేరియ‌న్‌గా మారింద‌ని చెప్పుకొచ్చింది.

బోనీకి సిగ‌రెట్ మార్పించ‌డానికి తన‌తో పాటు అంద‌రం ప్ర‌య‌త్నించామ‌ని కాని ఎవరూ ఆపలేకపోయారని జాన్వీ చెప్పింది.

నేను ఖుషీ సిగ‌రెట్స్ ప్యాకెట్స్ క‌ట్ చేసే వాళ్లం. ఒక్కోసారి పేస్ట్ వేసే వాళ్లం అయిన కూడా అవేమి ప‌ని చేయ‌లేదు.

-Advertisement-

చివ‌రికి నాన్న కోసం అమ్మ శాఖాహారిగా మారింది. నువ్వు స్మోకింగ్ మానే వరకు నేను నాన్ వెజ్ తినను అని చెప్పింది. డాక్టర్లు కాదు మీరు చాలా బలహీనంగా ఉన్నారు.నాన్ వెజ్ తినాలని చెప్పిన కూడా నాన్న స్మోకింగ్ ఆపేంత వ‌ర‌కు తిన‌లేదు.

నాలుగు-ఐదు సంవత్సరాల క్రితం, త‌న‌ కోరుకున్నట్లే ఆపేశారు అని ’’ అని జాన్వీ చెప్పింది. శ్రీదేవి , బోనీ కపూర్ 1996లో వివాహం చేసుకున్నారు.

శ్రీదేవి , బోనీ కపూర్‌ల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కాగా, జాన్వీకి ఖుషీ కపూర్ అనే సోదరి కూడా ఉంది.

మరిన్ని వార్తలు చదవండి :

t20 world cup 2022: ప్ర‌తి మ్యాచ్‌ని విరాట్ గెలిపించ‌లేడు.. మ‌ద‌న్ లాల్

bigg boss 6: బిగ్ బాస్ షో లో తొలిసారి గీతూ ఏడ్చేసింది.. అసలేం జరిగింది ?

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News