Janhvi Kapoor: అలనాటి తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోకి రాకముందే తన అందచందాలతో ఎంతో మంది అభిమానుల మనసులు దోచుకుంది జాన్వీ.
బాలీవుడ్ ఇండస్ట్రీకి దడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో పాల్గొన్నట్టు తెలుస్తుండగా, కొరటాల ప్రస్తుతం కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఇక జాన్వీ కపూర్ తర్వాతి సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ అమ్మడి రెండో తెలుగు సినిమా కూడా ఓకే అయిందని టాక్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్న రామ్ చరణ్ తన తదుపరి చిత్రంగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
ఇందులో జాన్వీ కపూర్‌ని కథానాయికగా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ పాత్రకి జాన్వీనే కరెక్ట్ పర్సన్ అని బుచ్చిబాబు చెప్పడంతో నిర్మాతలలు ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది.
also read :
Ram Charan: రామ్ చరణ్‌కి పుట్టబోయేది అమ్మాయేనట.. విషయం ఎలా బయటపడిందంటే..!
janhvi kapoor hot photos for filmfare awards 2023