Telugu Flash News

jaggery: బెల్లం తిన‌డం వ‌ల‌న ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయా..!

jaggery health benefits

jaggery: చ‌క్కెర క‌న్నా బెల్లం ఎన్నో రకాల ప్ర‌యోజ‌నాలు అందిస్తుంద‌నే విష‌యం మీకు తెలుసా? బెల్లం ఒక అద్భుతమైన శక్తి బూస్టర్ కాగా, ఇది కండరాలలో బలాన్ని నింపడానికి పని చేస్తుంది. బెల్లం ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కొవ్వు, సుక్రోజ్ మరియు మాంగనీస్ వంటి మూలం.

బెల్లం తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి కూడా బయటపడే అవ‌కాశం ఉంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు మంచి ఔష‌దంగా ప‌ని చేస్తుంది. బెల్లం వ‌ల‌న ఎన్ని ర‌కాల ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

బ‌హు ప్ర‌యోజనాలు..

భోజనం తర్వాత బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ‌వుతుంది. బెల్లంలో సుక్రోజ్ ఉంటుంది కాబ‌ట్టి ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి, మలబద్ధకం నుండి ఉపశమనం పొందేందుకు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇనుము యొక్క మంచి మూలంగా బెల్లంని ప‌రిగ‌ణిస్తారు. 100 గ్రాముల బెల్లంలో 11 మిల్లీగ్రాముల ఇనుము ఉంటుంది కాబ‌ట్టి ఐరన్ లోపం ఉన్నవారు బెల్లం తీసుకోవడం చాలా మంచిది. అలానే బెల్లంలో పొటాషియం,సోడియం వంటివి ఉంటాయి. ఇవి శరీరంలో సాధారణ యాసిడ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. బెల్లం తినడం వల్ల రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవ‌కాశం ఉంది.

బెల్లం తినడం వల్ల శరీరానికి కావ‌ల‌సిన‌ శక్తి అందుతుంది. చాలా మంది శక్తి కోసం బెల్లం, పప్పు తింటూ ఉంటారు ఇది కండరాల అలసటను త‌గ్గించ‌డ‌మే కాకుండా బాడీని శక్తివంతం చేస్తుంది.

పంచదారకు బదులు బెల్లం తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది. బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.

ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని చ‌క్క‌గా నివారిస్తుంది.

Exit mobile version