Jagapathi Babu: ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులని ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ గా మారి సక్సెస్ ఫుల్ కేరీర్ ను చూస్తున్నారు. అయితే 40 ఏండ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్న జగపతి బాబు తన ఆస్తులు పోగొట్టుకున్నారు.
అయితే గతేడాది తన ఆస్తి తిరిగి వచ్చిందంటూ కూడా కొన్ని వార్తలు పుట్టుకు రాగా వాటిపై స్పందించారు. ‘నా ఆస్తి క్యాసినో, పేకాటతో పోలేదు. వేరే వాళ్లు దోపిడి చేశారని కూడా అనను. డబ్బుల విషయంలో లెక్కలేకపోవడం, జాగ్రత్తగా ఉండకపోవడం మూలంగా అలాంటి పరిస్థితి వచ్చింది. నాకు డబ్బు విషయంలో అయితే జీరో నాలెడ్జ్.
లెక్క ప్రకారం.. నేను సంపాదించిన ఆస్తుల విలువ ఇప్పుడు 1000 కోట్లకు పైగానే ఉంటుంది. అయితే, అంతలా ఆస్తులు పోగొట్టుకోవడానికి కారణం ఏంటనేది పెద్ద ప్రశ్న. సమాధానం చెప్పడం కష్టం కూడానూ. ఇక క్యాసినోతో ఆస్తులు పోలేదు. నేను సరదాకు మాత్రమే ఆడతాను.
డబ్బు ఎలా పోయిందనే దానికి క్లారిటీ లేదు. ఒకరిని బ్లేమ్ చేయను కూడా. చెప్పాలంటే చాలా మందే ఉన్నారు. బ్రోకర్స్ వల్ల కావచ్చు. నేను కూడా అజాగ్రత్తగా ఉండకపోవడంతో అలా జరిగి ఉండచ్చు. ఇందులో నా పొరపాటు కూడా తప్పకుండా ఉందని’ తెలిపారు జగపతి బాబు.
also read:
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే అవకాశాలు? వ్యూహాత్మకంగా సీబీఐ అడుగులు!
ప్రేమ, సహజీవనం, యువతికి మరో పెళ్లి.. తర్వాత ఇంకో ట్విస్ట్!
Ananya Nagalla Latest Instagram Photos 2023 | Ananya Nagalla Hot