Telugu Flash News

జ‌గ‌ప‌తి బాబు సినిమా ఫంక్ష‌న్స్‌కి వెళ్ల‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదా..!

jagapathi babu

Jagapathi Babu: జగపతి బాబు ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు ఫిలిం బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి అయిత‌న జ‌గ‌ప‌తి బాబు ఫ్యామిలీ చిత్రాల‌తో పాటు ‘గాయం’ వంటి విలక్షణమైన సినిమాలు కూడా చేసి సక్సెస్ లు అందుకున్నారు. వ్యసనాల కారణంగా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు.

మరోపక్క సినిమాల్లో అవకాశాలు కూడా కరువయ్యాయి. అలాంటి టైములో విలన్ గా ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి మంచి పొజీష‌న్‌లో ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన వరుస సినిమాల్లో నటిస్తున్నప్పటికీ సినిమా వేడుకల్లో మాత్రం కనిపించడం లేదు.

దానిపై స్పందించిన జ‌గ‌ప‌తి బాబు..“నా కెరీర్ మొదలయ్యి 34 ఏళ్లు పూర్తవుతోంది అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. నా వరకూ నేను ఎంతోకొంత సాధించాననే అనుకుంటున్నాను. సినిమాలు తప్ప నాకు ఇంకేం తెలీదు. బిజినెస్ లు చేయడం తెలీదు. నలుగురిలో కలవడం తెలీదు .. మాట్లాడటం తెలీదు .. మాయమాటలు చెప్పడం తెలియదు.

నేను ఎప్పుడూ కమర్షియల్ గా ఆలోచించను .. కమర్షియల్ గా బిహేవ్ చేయను. అందుకే సినిమా ఫంక్షన్స్ కి కూడా వెళ్లడం మానేసాను .. ఎందుకంటే అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయాను. స్టేజ్ పై అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి నుంచునే అవసరం నాకు లేదని అనిపిస్తుంద‌ని జ‌గ‌ప‌తి బాబు అన్నాడు.

also read news :

Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!

bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception

 

Exit mobile version