Jagananna Housing Scheme : జగన్ ఎపీ సీఎం అయినప్పటి నుంచి ప్రజలకు ఇవి చేస్తాం..ప్రజలకు అవి చేస్తాం..అంటూ ఇష్టమొచ్చినట్టు హామీలిచ్చేశారు. అలా ఇచ్చిన హామీలలో కులమతాలూ, పార్టీలూ చూడకుండా అర్హులైన వారికి పక్కా ఇళ్ళు కట్టిస్తాం అంటూ ఇచ్చిన హామీ కూడా ఒకటి.
ఈ మాటలు వినగానే ఉండడానికి స్థలము,ఇల్లు దొరుకుతుంది అని పేద వాళ్ళు కూడా చాలా సంతోషించారు. అయితే ఈ హామీ వాస్తవానికి వచ్చే సరికి వాళ్ళు అన్నకున్న విధంగా,అన్న విధంగా చేయడానికి ప్రభుత్వం నానా తిప్పలు పడుతుంది.
అసలు విజయానికి వస్తే “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ళు” పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెండు విడతల్లో 30 లక్షల మందికి పైగా పేదలకు రూ. 55,188 కోట్లతో పక్కాఇళ్లు నిర్మించి ఇస్తామంటూ ప్రతిపాదనలు చేయగా.. 2020లో తొలివిడతగా 15.6లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని మొదలు పెట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా 15,901 లే-అవుట్లను ఏర్పాటు చేసింది.ఏడాది వ్యవధిలో తొలివిడత ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసి.. 2021లోగా రెండో విడతలో మిగిలిన సుమారు 15 లక్షల ఇళ్ళను పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది.
శ్మశానాలలో కాపురం ఉండమంటారా ?
అయితే ప్రభుత్వం అందించిన ఈ స్థలాలు చాలా వరకు ఉంటే శ్మశాన వాటికలకు కొంచెం దూరంలో ఉంటున్నాయి. లేదంటే ఊరు బయట లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్నాయి.దీంతో మునుపు స్థలాలు ఇస్తామంటే సంతోషంతో చంకలు గుద్దుకున్న జనం ఇప్పుడు ఆ స్థలాలు తమకు ససేమీరా వద్దనేస్తున్నారు.ఇంకేమైనా అంటే శ్మశానాలలో కాపురం ఉండమంటారా…అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఈ నెల 2న గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో హౌసింగ్ అధికారులు ఈ విషయంపై సీఎం జగన్ తో చర్చించారు.
ఈ చర్చల్లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళ స్థలాలను ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పారు. వారికి కేటాయించిన స్థలాల్లో కనీసం 30శాతం లే-అవుట్లు శ్మశాన వాటికలకు దగ్గరనే ఉన్నాయని, మరో 30 శాతం వరకు నివాసాలకు దూరంగా ఊరు బయట లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయని ఇందువల్లే ప్రజలు ఈ స్థలాలను తిరస్కరిస్తున్నారని జగన్ కు వివరించారు.
అనంతపురం,ప్రకాశం జిల్లాల్లో మునుపు కేటాయించిన ఇళ్ళ స్థలాలు కోర్టు కేసుల్లో ఉండటంతో ఆ జిల్లాల్లో 24,068 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.251కోట్ల వ్యయంతో దాదాపు 600 ఎకరాల భూమిని సేకరించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ ఇళ్ళ నిర్మాణానికి ప్రతి ఇంటికీ 1,80,000 ఇస్తుండగా..1,50,000 కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.మిగతా 30 వేలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తుందట.
కానీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం బయటకు రానివ్వకుండా..తామేదో మంచి చేసేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పీఎంఏవై కింద మొదటి దశలో చేపట్టిన 18.63లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ఈ జూన్ నెలకి పూర్తి చేయాల్సి ఉండగా… వీటి కోసం కేంద్రం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5,172 కోట్లు మంజూరు చేసింది.
కాగా రాష్ట్రం ప్రభుత్వం మాత్రం తన వాటాను ఇంకా విడుదల చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,140 కోట్లు ఆగిపోయాయని,దీంతో ఇళ్ల నిర్మాణం అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదని అధికారవర్గాలే చెబుతుండడం విశేషం.
also read news:
Lighter: మ్యాచ్ మధ్యలో సిగరెట్ లైటర్ అడిగిన క్రికెటర్.. దానితో ఏం చేశాడో తెలుసా?
Maldives : సెలబ్రిటీల బెస్ట్ డెస్టినేషన్ మాల్దీవుల గురించి మీకెంతవరకు తెలుసు ?
Pavitra- Naresh: పవిత్ర లోకేష్- నరేష్ కిస్ వెనక సీక్రెట్ పెళ్లి కాదు.. మరొకటి ఉంది..!