Homeandhra pradeshJagan vs Pawan Kalyan : ఏపీలో జగన్‌ వర్సెస్‌ పవన్‌.. ఆర్మీ రంగుపై మళ్లీ రాజకీయ వేడి!

Jagan vs Pawan Kalyan : ఏపీలో జగన్‌ వర్సెస్‌ పవన్‌.. ఆర్మీ రంగుపై మళ్లీ రాజకీయ వేడి!

Telugu Flash News

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ (Jagan vs Pawan Kalyan) మధ్య కొంత కాలంగా రాజకీయ రచ్చ కొనసాగుతోంది. ఇటీవల అది మరింత ముదిరి పవన్‌ చెప్పు చూపించే స్థితి వరకు చేరుకుంది.

విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమానికి వెళ్లిన పవన్‌ను ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో మొదలైన రగడ.. ఇప్పటం గ్రామంలో హైటెన్షన్‌ వాతావరణం ఏర్పడే వరకు.. తదుపరి పవన్‌ వారాహి వాహనం రంగు అంశం దాకా రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా పవన్‌ ఆర్మీ రంగుపై మనల్ని ఎవడ్రా ఆపేది అన్నట్లు తన సినిమా ఓపెనింగ్‌కు ఆర్మీ రంగు షర్ట్‌ ధరించి రావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Pawan Kalyan

గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. తన పాదయాత్రతో రాష్ట్రంతో చుట్టేసి ప్రజా సమస్యలు తెలుసుకున్న జగన్‌.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 2019 ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడంతో జగన్‌ భారీ మెజార్టీతో గెలిచారు. జగన్‌ కలలో కూడా సీఎం కాలేడని శాసించిన పవన్‌.. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్నారు పవన్‌ కళ్యాణ్‌.

అధికారంలోకి వచ్చాక ఓ ఏడాది పాటు సైలెంట్‌గా ఉన్న పవన్‌.. తర్వాత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు రాజధానుల ఉద్యమం పేరిట ఇటీవల వైసీపీ జోరు పెంచింది. విశాఖ గర్జన పేరిట మంత్రులు, అధికార పార్టీ నేతలంతా భారీ సభ నిర్వహించారు.

సరిగ్గా ఇదే సమయానికి పవన్‌ జనసేన జనవాణి పేరిట ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు సభ నిర్వహించాలని విశాఖ వేదిక చేసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్మిన్‌ ఇవ్వని పోలీసులు.. ఆయన్ను హోటల్‌లోనే ఉండిపోవాలని సూచించారు.

-Advertisement-

కామెంట్స్‌.. కౌంటర్‌ అటాక్‌..

ఈ నేపథ్యంలో సహనం నశించిన పవన్‌.. మంగళగిరికి చేరుకొని వైసీపీ నేతలపై నోరుపారేసుకున్నారు. వైసీపీ నేతలను ఉద్దేశించి చెప్పు చూపిస్తూ రెచ్చిపోయారు. చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు.

తర్వాత సీఎం జగన్‌ దానికి కౌంటర్‌ ఇచ్చారు. ఇలాంటి వారా మన నాయకులు? అని ప్రజలను అడిగారు. మూడు పెళ్లిళ్లు మీరూ చేసుకోండని సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏం కావాలి? అని ప్రశ్నించారు.

తర్వాత ఇప్పటం గ్రామంలో ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా పవన్‌ చేరుకొని ఇడుపుల పాయలో హైవే వేస్తానని హెచ్చరించారు. ఇక లేటెస్ట్‌గా పవన్‌ వారాహి వాహనంపై ఆర్మీ రంగు ఉందని, దీనిపై వైసీపీ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.

పవన్‌ కూడా రీసెంట్‌గా తన సినిమా ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా ప్రారంభోత్సవానికి ఆర్మీ రంగు షర్ట్‌ ధరించి రావడం చర్చనీయాంశమైంది. ఇలా జగన్‌ వర్సెస్‌ పవన్‌ రాజకీయ వేడి కొనసాగుతోంది. ఎన్నికల సమయానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది.

also read news:

DK Aruna on Kavitha : తప్పు చేయకపోతే భయమెందుకు? కవితపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

Green Cards: అమెరికన్‌ గ్రీన్‌ కార్డుల జారీలో కీలక మార్పులు.. భారతీయులకు భారీ ఊరట!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News