akshaya tritiya : అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలని ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్లు ఫిక్స్ అవుతుంటారు. ఏటా వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటుంటారు.
ఈ ఏడాది ఏప్రిల్ 22న తదియ తిథి మొదలై ఏప్రిల్ 23 సూర్యోదయం వేళకు ఉంటోంది. ఈ నేపథ్యంలో కొందరు 22న మరికొందరు 23న అక్షయ తృతీయ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. సంస్కృతంలో అక్షయ అంటే ఎన్నటికీ తరగనిది అని అర్థం.
అందుకే ఈ రోజున మంచి పనులు ప్రారంభిస్తే అనంతమైన శ్రేయస్సు కలుగుతుందని బలంగా నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. బంగారం ఇంట్లోకి తీసుకురావడం అంటే లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొస్తున్నట్టేనని చెబుతారు.
అయితే బంగారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు.. ఎంతోకొంత దానం చేయడం శ్రేయస్కరం అంటారు పండితులు. వెండివస్తువులు కొనుగోలు చేయడం కూడా పవిత్రంగా భావిస్తారు. కొందరు వెండివస్తువులు కొని తమ సన్నిహితులకు బహుమతిగా ఇస్తారు.
భూములు, ఆస్తులపై నూతన పెట్టుబడులకు అక్షయ తృతీయను మంచిదని చెబుతారు.ఈ రోజు వీటిపై పెట్టుబడులు పెడితే శుభప్రదం. స్టాక్ మర్కెట్‌లో పెట్టుబడులకూ అక్షయ తృతీయ నాడు అనుకూలం. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో గణనీయమైన లాభాలు ఆర్జిస్తామని భావిస్తారు. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, వ్యవసాయ ఉపకరణాలు, కొత్త బట్టలు, కొత్త పుస్తకాలు, దాన ధర్మాలు చేయడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు.
also read :
Naveen Yerneni : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతకి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు..!
Ambati Rayudu : అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఖాయమైందా? అందుకే ఆ ట్వీట్ చేశాడా?