Telugu Flash News

chandra grahan 2022 : చంద్ర గ్రహణం గర్భిణిలపై ప్రభావం చూపుతుందా ? తిరుపతి ఆలయం 11 గంటల పాటు మూసివేత !

lunar eclipse 2022

నవంబర్ 8 న ఏర్పడనున్న చంద్రగ్రహణం (chandra grahan) ,సాయంత్రం సమయం లో గంటపాటు గ్రహణం ఉండనుంది. అయితే అంతకుముందు సూకత్ కాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఈ ప్రభావం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ఆలయాలు మూసివేయడతాయి అని ఇప్పటికే కొన్ని దేవాదాయ శాఖలు వెల్లడించాయి . ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలవారి ఆరాధ్య ఆలయం తిరుమల వేంకటేశ్వరుని ఆలయం కూడా చంద్ర గ్రహణం ప్రభావం కారణముగా 11 గంటల పాటు అనగా మంగళవారం ఉదయం 8.40 గంటల నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసియేయనునట్లు TTD వెల్లడించింది .

గ్రహణం కారణముగా ప్రత్యేక దర్శనాల టోకెన్లు నవంబర్ 7 సోమవారం నుంచి నిలిపియేయనునట్లు మరియు ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. చంద్ర గ్రహణం మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు కొనసాగనుంది . గ్రహణం ముగిసిన వెంటనే సంప్రోక్షణ, ప్రదోష కాలపు పూజలు జరిపి ఆలయాన్ని తిరిగి ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది .

చంద్ర గ్రహణం గర్భిణిలపై ప్రభావం చూపుతుందా ?

ఎప్పుడైనా గ్రహణం అనగానే అధికంగా  కంగారు పడేది గర్భిణీ స్త్రీలు ఎందుకంటే .గ్రహణ సమయంలో ఎటూ కదల రాదు అని ఒకే దిశలో పడుకొని ఉండాలి అని, కదిలితే గ్రహణ మొర్రితో పిల్లలు పుడతారు వంటి వదంతులు నమ్మకాలు చాలానే ఉన్నాయి.

అయితే పూర్వికులు చెప్పిన దానిప్రకారం సూర్యగ్రహణం సమయం లో గ్రహణంలోని అతినీలలోహిత కిరణాల( UVR ) ద్వారా సున్నితమైన శిశువు పైన ప్రభావం పడే అవకాశం ఉంటుంది. తద్వారా సున్నితమైన శిశువు పై ప్రభావంపడి శిశువు వైకల్యం తో జన్మించే అవకాశం ఉంటుందని పూర్వికులు చెబుతుంటారు . అయితే ఆ దుష్ప్రభావం అత్యధికంగా సూర్య గ్రహణంలోనే ఉంటుంది కానీ చంద్ర గ్రహణం వలన అంతటి హాని కలుగదు కావున గర్భిణీలు ఎలాంటి భయమునకు లోను కాకుండా ఉండవచ్చు. గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా బయటకు రాకుండా కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది.

నిజానికి పూర్వం అధిక జనాభా గుడిసెలు మరియు పెంకుటిళ్ళ లో ఉండేవారు ఆసమయంలో ( UVR) అతినీలలోహిత కిరణాలు ఇంటి లోనికి ప్రవేశించే అవకాశం ఉండేది అందుకే గర్భిణి స్త్రీ లను అధిక జాగ్రత వహించాల్సింది గ చెప్పేవారు . ఒకవేళ మీఇంటిలో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే కాస్త జాగ్రత వహించడం ఎందుకైన మంచిది .

also read :

తులసి మొక్కకు ఏ వేళలో నీళ్లు పోయాలి…

Exit mobile version