IPL: టీ20 వరల్డ్ కప్ సమరం ముగిసింది. ఇక ఇప్పుడు ఐపీఎల్ సమరానికి తెరలేవబోతుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ జరగనున్న నేపథ్యంలో ఈ గేమ్‌కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాళ్ల కోసం వాళ్ల ఫ్రాంచైజీ 900 కోట్లు ఖర్చు చేసిందట.
2008లో ప్రారంభమైన ఐపీఎల్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచక్రికెట్‌నే శాంసించే స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్ జరిగినన్ని రోజులు ఇంటర్నేషనల్ క్రికెట్ కి బ్రేకులు పడుతున్నాయి. అంతటి పవర్ ఫుల్ లీగ్ అయిన ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆయా జట్లు ఆటగాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుల వివరాలు మనీబాల్ సంస్థ ప్రకటించగా, ఇది చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
2008 నుంచి 2022 వరకు మొత్తం 15 సీజన్లలో ఆర్‌సీబీ ఆటగాళ్ల కోసం ఏకంగా రూ.910.5 కోట్లు ఖర్చు చేసి ఈ జాబితాలో టాప్‌లో నిలిచారు. ఇందులో విరాట్ కోహ్లీ ఒక్కడికే 158.2 కోట్లు చెల్లించారు. గత సీజన్‌లో ఫామ్ లేమితో రూ.15 కోట్లకు తగ్గిన విరాట్.. అంతకుముందు వరకు రూ.17 కోట్లు తీసుకున్నాడు. ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది.
ఐదు టైటిళ్లు గెలిచిన అంబాని టీమ్ ఆటగాళ్ల కోసం ఏకంగా రూ. 884.5 కోట్లు ఖర్చు చేయగా, కేకేఆర్ రూ.852.5 కోట్లతో మూడో స్థానం ఢిల్లీ క్యాపిటల్స్ రూ.826.6 కోట్లతో నాలుగో స్థానంలోఉన్నాయి.. పంజాబ్ కింగ్స్ రూ.778.3 కోట్లతో ఐదో స్ధానంలో , రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ రూ.761.1 కోట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాయి.
మధ్యలో వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.646.9 కోట్లు ఖర్చు చేయగా, రాజస్థాన్ రాయల్స్ రూ.613.3 కోట్లు ఖర్చు చేసింది. ఇక గతేడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్ల కోసం రూ.89.2 కోట్లు ఖర్చు చేయగా, గత ఏడాది టైటిల్ విన్నర్ గుజరాత్ టైటాన్స్ రూ.88.3 కోట్లు ఆటగాళ్లకు వేతనాలుగా ఇచ్చింది. అయితే ఆటగాళ్ల జీతాల విషయంలో టాప్‌లో నిలిచిన ఆర్‌సీబీ.. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం విశేషం.
also read news:
ఎన్టీఆర్ ఆ నటి ని కోడలా అని పిలిచేవారట ..ఎందుకో తెలుసా?
బేబి బంప్‌తో నిత్యా మీనన్ ..ప్రెగ్నెంట్ లుక్ లో క్యూట్ గా..