IPL: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ప్రస్తుతం ఐపీఎల్‌కి మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకునే దశలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2023తో సారథిగా చివరి సీజన్ ఆడనున్నాడనే వార్తల నేపథ్యంలో.. ధోని తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎవరు? అనే విషయంపై చర్చ నడుస్తుంది. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. అయితే కరోనా కారణంగా గత మూడు సీజన్లు సొంతమైదానాల్లో కాకుండా బయట జరగడంతో ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు.
ఐపీఎల్ 2022 సీజన్లోనే వీడ్కోలు పలికేందుకు ప్రయత్నాలు చేసినా.. జట్టుకు సరైన సారథి దొరకకపోవడం.. సొంత అభిమానుల మధ్య వీడ్కోలు పలకాలనే ఆలోచనతో ఆ నిర్ణయాన్ని కాస్త వెనక్కి తీసుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలోనే ధోనీ సూచనలతో రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించగా, తీవ్ర ఒత్తిడికి లోనై తడబడ్డాడు. కెప్టెన్సీ వల్ల అతని వ్యక్తిగత ప్రదర్శన కూడా దెబ్బ తినడంతో చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మళ్లీ ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే ధోనీ ఈ ఏడాదికి మించి ఆడలేని పరిస్థితి ఉండటంతో తప్పని పరిస్థితులలో అతని వారుసుడిని ఎంపిక చేయాల్సి సిట్యుయేషన్ అయితే ఉంది..
ధోని తర్వాత రుతురాజ్ గైక్వాడ్ భవిష్యత్‌లో చెన్నై సారథిగా కనిపించే అవకాశం ఉందనే వార్తలు జోరందుకున్నాయి. విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్టెన్‌గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌పై 220 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో, సెమీ ఫైనల్లో అస్సాంపై 165 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో మహారాష్ట్ర జట్టు విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్లోకి ప్రవేశించినప్పటికీ, ఫైనల్లో ఓడిపోయింది. రుతురాజ్ గత 10 ఇన్నింగ్స్‌ల్లో 8 శతకాలు కొట్టాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తూ.. భీకరమైన ఫాంలో ఉండగా ధోని వారసుడిగా అతనిని ఎంపిక చేస్తే బాగుంటుందని కొందరు విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు. టీమ్ సీఈవోతో పాటు కోచ్‌లు కూడా రుతురాజ్ నియమాకాన్ని సుముఖంగా ఉన్నారని, మహేంద్ర సింగ్ ధోనీ ఒక్కడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. అతనే సీఎస్కే తదుపరి కెప్టెన్ అని ఆ జట్టు వర్గాలు చెబుతున్నాయి.