HomesportsIPL 2023 : అతడికి అద్భుతమైన కెరీర్‌.. ఇండియాకు మంచిది.. యువ క్రికెటర్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు

IPL 2023 : అతడికి అద్భుతమైన కెరీర్‌.. ఇండియాకు మంచిది.. యువ క్రికెటర్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు

Telugu Flash News

IPL 2023 : యువ క్రికెటర్‌, రాజస్తాన్ రాయల్స్‌ ఓపెనింగ్‌ బ్యాటర్‌ యశస్వి జైశ్వాల్‌ (yashasvi jaiswal) పై టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్‌ శర్మ (rohit sharma) ప్రశంసల వర్షం కురిపించాడు. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై వర్సెస్‌ ఆర్‌ఆర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఇందులో భారీ టార్గెట్‌ను ముంబై అవలీలగా సాధించింది.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన హిట్‌ మ్యాన్‌ రోహిత్‌.. జైశ్వాల్‌ను అభినందనలతో ముంచెత్తాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఆర్ఆర్.. నిర్ణీత 20 ఓవర్లకు 212 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ 62 బంతుల్లోనే 124 పరుగులతో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

అయితే, ముంబై బ్యాటర్లు ఈ స్కోరును ఊదేశారు. ఆఖర్లో వచ్చిన టిమ్‌ డేవిడ్‌ మాత్రం హైలెట్‌ అయ్యాడు. వరుసగా మూడు సిక్సర్లు ఆఖరి ఓవర్లో బాదేసి ముంబైకి విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన రోహిత్‌ శర్మ.. భారీ టార్గెట్‌ను ఛేదించినందుకు సంతోషంగా ఉందన్నాడు.

చివరి మ్యాచ్‌లో కూడా భారీ స్కోరు ఛేజ్ చేసే వరకు వచ్చి తడబడ్డామని గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అలాంటి పొరపాటు చేయకుండా విజయం సాధించడం సంతోషంగా ఉందని చెప్పాడు.

తమ జట్టులో పొలార్డ్‌ స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టంగా ఉందని, కానీ ఇప్పుడు ఆ స్థానంలో టిమ్‌ డేవిడ్‌ వచ్చాడని, ఆ సత్తా డేవిడ్‌కు ఉందని హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. ఈ క్రమంలో రాజస్తాన్ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌పై రోహిత్‌ మాట్లాడాడు.

రాజస్తాన్‌ తరఫున జైశ్వాల్‌ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని మెచ్చుకున్నాడు. అతడి గత ఏడాది ప్రదర్శను చూశానని, ఈసారి మరింత పుంజుకొని ఓ మెట్టు పైకెక్కాడని చెప్పాడు. జైస్వాల్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందన్నాడు.

-Advertisement-

ఇంత పవర్‌ ఎక్కడ నుంచి వస్తుందని జైస్వాల్‌ను అడిగానని రోహిత్ అన్నాడు. అయితే, తాను జిమ్‌కు వెళ్తున్నానని జైస్వాల్‌ చెప్పినట్లు హిట్‌ మ్యాన్‌ తెలిపాడు. జైస్వాల్‌ ఇలా చెలరేగి ఆడటం ఆర్ఆర్ జట్టుకు కలిసొచ్చే అంశమన్నాడు. అంతేకాదు.. భవిష్యత్‌లో టీమిండియాకు కూడా మంచిదన్నాడు.

అతడి కెరీర్‌ మరింత దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జైస్వాల్ 62 బంతులు ఎదుర్కొన్నాడు. 16 ఫోర్లు, 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 124 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్‌ వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.

also read :

Salman Khan: తండ్రి కావాల‌నుకుంటున్నానంటూ స‌ల్మాన్ కామెంట్.. అంద‌రు షాక్

Samyuktha Menon : విరూపాక్ష బ్యూటీ పెద్ద‌ మ‌న‌సు.. కాలేజ్ అమ్మాయిల కోసం ఏం చేసిందంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News