HomesportsIPL 2023 : కేఎల్‌ రాహుల్‌ ఔట్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరం.. డబ్ల్యూటీసీలో ఆడగలడా?

IPL 2023 : కేఎల్‌ రాహుల్‌ ఔట్‌.. గాయంతో సీజన్‌ మొత్తానికి దూరం.. డబ్ల్యూటీసీలో ఆడగలడా?

Telugu Flash News

IPL 2023 : లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాయల్‌ ఛాలెంజర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా గాయం తగిలిన కేఎల్‌ రాహుల్‌.. టోర్నీ మెత్తానికి దూరమయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ నడుస్తున్నప్పడు తొడ కండరాల నొప్పితో అల్లాడిపోయాడు. అయినప్పటికీ ఆఖర్లో బ్యాటింగ్‌ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ, గంభీర్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ గొడవ పడ్డారు. మాటలు ఎక్స్‌ఛేంజ్‌ చేసుకున్నారు. ఈ ఘటన సోషల్‌మీడియాను ఊపేసింది.

గొడవ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, గౌతమ్‌ గంభీర్‌కు వంద శాతం మ్యాచ్‌ ఫీజును బీసీసీఐ కోసేసింది. నవీన్‌ఉల్‌హక్‌లకు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం ఫీజును కట్‌ చేసింది. ఇక కేఎల్‌ రాహుల్‌ విషయానికి వస్తే.. టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదని, అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలోకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రస్తుతం కేఎల్‌ రాహుల్‌ లక్నోలోనే ఉన్నాడు. అక్కడి నుంచి ముంబైకి వెళ్లున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం అతడిని పరీక్షించనుందని సమాచారం. గాయం తర్వాత ఇప్పటి వరకు కేఎల్‌ రాహుల్‌ను స్కాన్‌ చేయలేదు.

దెబ్బ తగిలిన తర్వాత 48 గంటల తర్వాత మాత్రమే స్కానింగ్‌ చేయడానికి సాధ్యమవుతుంది. దీంతో నిర్ణీత సమయం గడచిన తర్వాత అతడికి టెస్టులు చేయనున్నారు. అయితే, లక్నో కెప్టెన్‌ జట్టుకు దూరం కావడంతో మిగతా మ్యాచ్‌లకు కెప్టెన్‌గా కృనాల్‌ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌కు గాయమైన మ్యాచ్‌లో కూడా టీమ్‌ను కృనాల్‌ పాండ్య లీడ్‌ చేశాడు. ఇకపోతే ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జట్టులో కేఎల్‌ రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయపడటం ఇబ్బందికరంగా మారింది.

జూన్‌ 7వ తేదీ నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఆలోపు కేఎల్ రాహుల్‌ సెట్‌ అవుతాడా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేఎల్ రాహుల్ గాయం ఎంత తీవ్రంగా ఉందో స్కాన్ చేస్తేగానీ తెలియని పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లో లక్నో మంచి ఫామ్‌ కొనసాగిస్తోంది. కెప్టెన్‌ వైదొలగడంతో ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ 9 మ్యాచ్‌ల్లో 34.25 సగటుతో 274 పరుగులు నమోదు చేశాడు. రాహుల్‌ త్వరగా కోలుకోవాలని లక్నో ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

ALSO READ :

Pakistan : పాకిస్తాన్‌లో దయనీయ పరిస్థితులు.. చుక్కలనంటిన ద్రవ్యోల్బణం

-Advertisement-

PM Modi : జై బజరంగ్‌ బలి.. కర్ణాటకలో కొత్త అస్త్రాన్ని ప్రయోగించిన ప్రధాని మోదీ..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News