HomecinemaIPL 2023: ఐపీఎల్‌లో ర‌చ్చ లేపిన సినీ స్టార్స్.. పీక్స్ లో బాల‌య్య కామెంట్రీ, ర‌ష్మిక, త‌మ‌న్నా ఊర‌మాస్ డ్యాన్స్

IPL 2023: ఐపీఎల్‌లో ర‌చ్చ లేపిన సినీ స్టార్స్.. పీక్స్ లో బాల‌య్య కామెంట్రీ, ర‌ష్మిక, త‌మ‌న్నా ఊర‌మాస్ డ్యాన్స్

Telugu Flash News

IPL 2023: ఐపీఎల్ 2023 మార్చి 31న ఘ‌నంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఘనంగా మొదలైన ఓపెనింగ్ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్లు తమన్నా భాటియా , నేషనల్ క్రష్ రష్మిక మందన్న తమ డాన్స్ లతో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టారు. ఈ ముద్దుగుమ్మల పెర్ఫామెన్స్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. త‌మ‌న్నా పలు హిందీ సాంగ్స్ తో పాటు పుష్ప‌లోని ‘ఊ అంటావా మావా’ సాంగ్ కు స్టెప్పులేసి స్టేడియం హోరెత్తేలా చేసిది.

ఇక రష్మిక మందన్న కూడా తన డాన్స్ పెర్ఫామెన్స్ తో దుమ్ము రేపింది. పుష్ప చిత్రంలోని శ్రీవల్లి, రారా సామీ పాటలకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. రీసెంట్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ సాంగ్ కు కూడా నేషనల్ క్రష్ ర‌ష్మ‌కి డాన్స్ చేసింది.

మొత్తానికి ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో ఈ ముద్దుగుమ్మలు తమ డాన్స్ తో హోరెత్తించ‌గా, బాల‌య్య త‌న కామెంట్రీతో అద‌ర‌గొట్టాడు. జై బాలయ్య సాంగ్ తో ఆయనకు తెలుగు కామెంటేటర్స్ స్వాగతం ప‌ల‌క‌గా, హీరో నందుతో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణలతో కొద్ది సేపు ఆయ‌న ముచ్చ‌టించారు. ఇప్ప‌టికే న‌టుడిగా, కామెంటేట‌ర్‌గా అద‌ర‌గొట్టిన బాల‌య్య హోస్ట్‌గాను చెల‌రేగిపోయారు.

also read :

-Advertisement-

Tamanna Latest Photos, Stills, instagram pics 2023

Rashmika Mandanna at Zee Cine Awards 2023 Photos and Videos

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News