Homebigg boss telugu season 6Bigg Boss 6: నా గేమ్‌ని తొక్కేస్తున్నారంటూ ఫైమా అస‌హనం.. భ‌లే మెలిక పెట్టేశారే...!

Bigg Boss 6: నా గేమ్‌ని తొక్కేస్తున్నారంటూ ఫైమా అస‌హనం.. భ‌లే మెలిక పెట్టేశారే…!

Telugu Flash News

Bigg Boss 6: బిగ్ బాస్ షో రాను రాను మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ త‌గ్గుతున్న కొద్ది గేమ్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ పోటీకి కంటెండర్ టాస్క్ జరిగింది. ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఊహించని విధంగా మెలిక పెట్ట‌గా, గార్డెన్ లో బిబి ట్రాన్స్ పోర్ట్ అనే వెహికల్ ఆగి ఉంటుంది. ఆ వెహికల్ ని ఎవరైతే ముందుగా చేరుకొని హార్న్ మోగిస్తారో వారు కెప్టెన్సీ టాస్క్ పోటీకి ఎంపిక అవుతారని బిగ్ బాస్ చెప్పారు. ఇక మిగిలిన వాళ్లంతా కలసి కెప్టెన్సీ పోటీకి తమలో ఎవరు అర్హులు కారో ఇద్దరినీ ఏకాభిప్రాయంతో ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరిని ముందుగాకెప్టెన్సీ టాస్క్ కి ఎంపికైన వ్యక్తి తొలగించి.. మిగిలిన వ్యక్తిని మరో ఛాన్స్ ఇవ్వాల‌నే రూల్ పెడ‌తారు.

కెప్టెన్సీ ర‌చ్చ‌..

తొలి రౌండ్ లో ఆది రెడ్డి ముందుగా హార్న్ మోగించి కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ముందుగా హార్న్ మోగించిన వారు కొంత డబ్బు వెచ్చించి కెప్టెన్సీ కంటెండర్ ప్లేస్ ని కొనుక్కోవాల్సి వ‌స్తుంది. అయితే ఎంత వెచ్చిస్తారో అంత మొత్తం బిగ్ బాస్ ప్రైజ్ మనీలో తగ్గిస్తామ‌ని బిగ్ బాస్ చెబుతారు. కెప్టెన్సీ కంటెండర్ కోసం ఆది రెడ్డి రూ లక్ష వెచ్చించ‌డంతో ఆ ల‌క్ష ప్రైజీ మ‌నీలో త‌గ్గింది. అయితే మొదటి రౌండ్ లో ఫైమాని తొలగించి రోహిత్ కి ఛాన్స్ ఇవ్వ‌డంతో ఫైమా ఆవేదన వ్య‌క్తం చేసింది. నా గేమ్‌ని తొక్కేస్తున్నారు అంంటూ ఆవేద‌న చెందింది.

అన్ని రౌండ్స్ పూర్తయ్యే సరికి కెప్టెన్సీ కంటెండర్స్ గా ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, శ్రీహాన్, ఇనయ అర్హత సాధించి రేసులో నిలిచారు. వీరిలో ఎవ‌రు కెప్టెన్ అవుతారు అన్న‌ది నేడు తెలియ‌నుంది. ఇక శ్రీసత్య.. ఈవారంతో ఈమె ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ వీడుతుంది అనుకుంటే.. ఈమె ఎవరు ఎలిమినేట్ అవుతారో జోస్యాలు చెప్పుకొస్తుంది. ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆదిరెడ్డి అడిగితే.. కీర్తి అని చెప్పింది శ్రీసత్య. దానికి ఆదిరెడ్డి కూడా అవును నాకు కూడా అదే అనిపిస్తుందని వంత పాడాడు .. టాప్ 5లో మనమే.. విన్నర్ నేనే అంటూ చెప్పిన గీతు పరిస్థితి ఏమైందో చూసిన కూడా వీళ్ల‌కి గేమ్ ఏంటో తెలియ‌డం లేదు.

also read news:

horoscope today : 17-11-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News