Telugu Flash News

Telangana TDP: తెలంగాణ ప్రజలు టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారు.. ‘ఇంటింటికీ టీడీపీ’లో చంద్రబాబు

chandrababu naidu

chandrababu naidu

Telangana TDP News : తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తేవడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీకి జవసత్వాలు తెచ్చేందుకు ఇటీవలే కొత్త అధ్యక్షుడిని నియమించారు చంద్రబాబు.

సీనియర్‌ నేత కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా పాత నేతలందరికీ ఫోన్లు చేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

తాజాగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన అధినేత చంద్రబాబు.. కార్యక్రమాన్ని ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. నందమూరి తారక రామారావుకు భారత రత్న ఇవ్వాలన్నదే ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను అనుగుణంగా పని చేయాలని తెలంగాణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు చంద్రబాబు. తెలుగు వారు ఎక్కడున్నా పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు.

తెలంగాణలో ప్రతి ఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారన్నారు. తాను ఇక్కడికి వచ్చి చూశాక పార్టీ ఎక్కడ ఉందో కనిపిస్తోందన్న చంద్రబాబు.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని తెలంగాణ గడ్డపైనే నెలకొల్పారని గుర్తు చేశారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఆనాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని గుర్తుచేశారు. 41 ఏళ్లుగా తెలుగు వారి కోసమే పని చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి టీడీపీ మారుపేరుగా అవతరించిందని చంద్రబాబు చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తోందని చంద్రబాబు వివరించారు.. సంక్షేమ పథకాలు టీడీపీతోనే ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు. పేదవాళ్ల కోసం చాలా సంక్షేమ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందన్న చంద్రబాబు.. ఆనాటి పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పేదవారికి ఎన్టీఆర్‌ భూమిని ఇచ్చారని కొనియాడారు.

భూమిశిస్తు రద్దు చేసి రైతుకు లాభం చేకూర్చారని వెల్లడించారు. మహిళలకు సాధికారత కల్పించిన ఏకైక పార్టీ టీడీపీనే అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో మౌలిక వసతులను ఎన్టీఆర్ కల్పించారని చంద్రబాబు అన్నారు.

also read :

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ రేంజ్ అంటే ఇది క‌దా.. 15 రోజులకు రూ. 50 కోట్ల పారితోషికం

Kriti Sanon Hot Photo Gallery Collection, Images, Stills

Pooja Hegde: పూజా హెగ్డే- త్రివిక్ర‌మ్ మ‌ధ్య ఏం న‌డుస్తుంది.. కాస్ట్ లీ కారు గిఫ్ట్ గా.. !

Raashi Khanna Latest instagram photos, images, stills 2023

Exit mobile version