International Women’s Day 2023 Special Story: సృష్టికి మూల కారణం మహిళ. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, కూతురుగా.. ఇలా అనేక బంధాలతో పురుషుడి జీవితాన్ని పరిపూర్ణం చేసింది మహిళ. అలాంటి మహిళలు ప్రస్తుతం దేశాభివృద్ధిలో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. మహిళా శక్తిని చాటి చెబుతున్నారు.
అయితే, చాలా చోట్ల మహిళలకు పురుషులతో సమానంగా గౌరవం, అవకాశాలు దక్కకపోవడం శోచనీయం. కొన్ని ప్రాంతాలు, దేశాల్లో కుటుంబం అనే నాలుగు గోడల మధ్యే మహిళలు నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారని తెలియజెప్పేందుకు, మహిళలను ప్రోత్సహించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
మహిళల హక్కుల గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా దినోత్సవానికి సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యం, ఈ ఏడాది ఈ వేడుక థీమ్ గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. చాలా దేశాల్లో మహిళలకు అనేక అవకాశాలు దక్కుతున్నాయి. క్రీడా, రాజకీయాలు, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాల్లోనూ ప్రోత్సాహం దక్కుతోంది. ప్రతి రంగంలోనూ మహిళా భాగస్వామ్యం ఉంటోంది.
ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం 1909 ఏడాది నుంచి మొదలైంది. నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా మహిళా దినోత్సవం జరుగుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. సుమారు 15 వేల మంది మహిళలు భాగమయ్యారు. తమ హక్కులను రక్షించాలని డిమాండ్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లోకి వచ్చారు. వేతనాలు పెంచి పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు కూడా కల్పించాలన్నారు.
భారీ ఉద్యమానికి దిగొచ్చిన నాటి ప్రభుత్వం.. వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని ఏటా నిర్వహించుకోవాలని ప్రకటన చేసింది. ఈ ప్రభావం అన్ని దేశాలకు విస్తరించింది. రష్యాలో ఉద్యమంతో ఆ దేశంలో మహిళలందరికీ ఓటు హక్కు లభించింది. ఇక ఈ ఏడాది మహిళా దినోత్సవ థీమ్‌గా ‘ఎంబ్రేస్ ఈక్విటీ’ అంశాన్ని తీసుకున్నారు. అంటే లింగ సమానత్వంపై అందరూ దృష్టి పెట్టాలని దీని అర్థం.
also read :
medico preethi case : మెడికో ప్రీతి కేసులో మరో మలుపు.. వైద్యులను విచారణ చేయాలి
Satvik Suicide Case : సాత్విక్ ఆత్మహత్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Chiranjeevi: చిరంజీవి చెంప కందిపోయేలా కొట్టిన హీరోయిన్.. అసలేమైంది..!
Sobhita Dhulipala hot instagram pics, photos, images 2023
Nani: నాని మాస్ లైనప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే..!