Telugu Flash News

North Korea: కిమ్‌ రాజ్యంలో మరో అరాచకం.. రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు!

North Korea: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ అరాచకాలు అప్పుడప్పుడూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. అత్యంత కఠినమైన శిక్షలు విధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా కిమ్‌ వైఖరి చర్చనీయాంశంగా మారుతోంది. ప్రపంచం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కిమ్‌ వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కిమ్‌ చేసిన పనికి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రెండేళ్ల చిన్నారికి కిమ్‌ జీవిత ఖైదు విధించాడనే వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆలోచింపజేస్తోంది.

కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రాజ్యంలో అకృత్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. క్రైస్తవులపై ఉత్తరకొరియా ప్రభుత్వ ఆగడాల గురించి తాజాగా అమెరికా విదేశాంగ శాఖ ఓ నివేదిక వెలువరించింది. క్రిస్టియన్లు తమ పవిత్ర గ్రంథంతో కన్పిస్తే అక్కడ దారుణంగా శిక్షలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఓ రెండేళ్ల చిన్నారికి యావజ్జీవ కారాగార శిక్ష వేసినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022 పేరిట అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను వెలువరించింది.

ఈ నివేదికలో ఉత్తరకొరియా ప్రభుత్వం అక్కడి ప్రజలను హింసిస్తున్న తీరును తూర్పారబ్టటింది. ఇతర మతాల వారిపై కిమ్‌ కర్కశంగా వ్యవహరిస్తున్నారని, అమానవీయ రీతిలో శిక్షలు ఉంటున్నాయని నివేదిక తెలిపింది. ఇప్పటిదాకా అక్కడ దాదాపు 70 వేల మంది క్రిస్టియన్లను జైల్లో పెట్టినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇలా ఖైదు చేసిన వారిలో రెండేళ్ల చిన్నారి ఉందని తెలిపింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2009లో ఆ చిన్నారి కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రెండేళ్ల చిన్నారి సహా కుటుంబ సభ్యులందరికీ జీవిత ఖైదు విధించినట్లు నివేదిక స్పష్టం చేసింది.

అంతేకాదు.. మతపరమైన కార్యకలాపాలకు పాల్పడేందుకు యత్నించారనే కారణంతో అనేక మంది క్రిస్టియన్లను పొలిటికల్‌ జైలు శిబిరాలకు తరలించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆ శిబిరాల్లో ఖైదీలు దారుణ పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారని తెలుస్తోంది. వారిని శారీరకంగా హింసించడం, జీవించే హక్కును వ్యతిరేకించడం, కనీసం విచారణ అయినా సవ్యంగా జరపకపోవడం, లైంగిక వేధింపులకు పాల్పడటం లాంటి దారుణమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నివేదికలో పేర్కొన్నారు.

Rad Also : Kim jong un : 40 రోజులు కనిపించకుండా పోయి.. కుమార్తెతో దర్శనమిచ్చిన కిమ్‌!

Exit mobile version