Intermittent Fasting, లేదా సమయానుకూలంగా ఆహారం తీసుకునే ప్రక్రియ (TRE), మహిళల్లో ముఖ్యంగా రుతుక్రమం ఆగే సూచనలు కనిపిస్తున్న మరియు ఆగిన వారికీ DHEA అనే హార్మోన్ పై ప్రభావం చూపుతుంది. ఈ డైటింగ్ విధానం హార్మోన్ ఉత్పత్తిలో తగ్గుదలకు కారణమవుతుంది.
ఈ అధ్యయనంలో రుతుక్రమం ఆగే సూచనలు కలిగినవారు మరియు ఆగిన మహిళలు పాల్గొన్నారు, ఎనిమిది వారాల పాటు వారి మీద అధ్యయనం చేసారు. అధ్యయనంలో ముందుగా ఈ డైటింగ్ చేయడం ఆరోగ్యకరమైనదా? కాదా? అనే దాని మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు.
ఈ డైటింగ్ లో తినే విధానం ఎలా ఉంటుందంటే ఇది పగటిపూట తినే సమయాన్ని తగ్గిస్తుంది ఇది రోజుకు కొన్ని గంటలు తినకపోవడం లేదా వారంలో రెండు సార్లు 24-గంటల ఉపవాసాలను పాటించడం.
ఈ ప్రత్యేక అధ్యయనంలో, రుతుక్రమం ఆగిన ముందు మరియు పోస్ట్-మెనోపాజ్ స్త్రీలు 4 నుండి 6 గంటల మధ్యలో తింటున్నారు.
ఆహారం తీసుకున్న మహిళలు 3 నుండి 4% బరువు తగ్గినట్లు ఈ నివేదికలో తేలింది. TRE సెక్స్ బైండింగ్ గ్లోబులిన్ హార్మోన్ స్థాయిలను మార్చలేదని పరిశోధనా బృందం కనుగొంది.
ఇది శరీరం అంతటా పునరుత్పత్తి హార్మోన్లను తీసుకువెళ్ళే ప్రోటీన్. టెస్టోస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ స్థాయిలు కూడా మారలేదు.
అయినప్పటికీ, డీహైడ్రోపియాండ్రోస్టెరాన్ (DHEA) చివరిలో రెండు సమూహాలలో ఉన్న మహిళలకు గణనీయంగా తగ్గింది. దాదాపు 14 శాతం తగ్గింది.
DHEA హార్మోన్ సంతానోత్పత్తి ప్రయోజనాలను కలిగిస్తుంది మరియు సంతానోత్పత్తి కోసం వెళ్లేవారికి తరచుగా మెరుగైన అండాశయ పనితీరు కోసం డాక్టర్లు దీనిని సిఫార్సు చేస్తారు. 14% తగ్గుదల తక్కువే అయినా, ఉండాల్సిన DHEA స్థాయిలు దీనివలన తగ్గింది.
రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదానికి ఈ హార్మోన్ కు ప్రత్యక్ష సంబంధం ఉందని అందువల్ల, పరిమిత స్థాయిలలో ఈ హార్మోన్ తగ్గుదల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని ప్రముఖ పరిశోధకురాలు క్రిస్టా చెప్పారు.
read more news :
మీ జలుబును మీరే వదిలించుకోండి.