Homecinemaప్రభాస్ ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

ప్రభాస్ ‘సలార్’ నుంచి అదిరిపోయే అప్ డేట్ !

Telugu Flash News

పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ క్రేజీ  ప్రాజెక్ట్‌లలో ‘సాలార్’ ఒకటి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పార్ట్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. వచ్చే షెడ్యూల్‌తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ఓ లోయలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు. అండర్‌గ్రౌండ్‌ విజువల్స్‌తో కూడిన ఈ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు మెయిన్‌ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది.

అలాగే రాబోయే షెడ్యూల్‌లో ప్రభాస్ ఛేజింగ్ సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నారు. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ చిత్రాలను రూపొందించిన ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. అందుకే ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు.

ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెది ట్రాజెడీ క్యారెక్టర్.. ప్రభాస్, శృతి హాసన్ మధ్య వచ్చే ట్రాక్ కూడా చాలా ఎమోషనల్ గా ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు చదవండి :

మహేష్ బాబు సరసన ప్రియాంక ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడంటే ?

#RC15: రామ్ చరణ్ జిమ్ లో కసరత్తులు..వీడియో వైరల్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News